పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన బెంచీలను ధ్వంసం చేసిన ఘటనలో.. ఇరువర్గాల మధ్య దాడి జరిగింది. నరసరావుపేట మండలం పమిడిపాడు గ్రామంలో సర్పంచిగా ఎన్నికైన గౌసియా బేగం... గ్రామంలోని పంచాయతీ కార్యాలయం ఆవరణలో సిమెంట్ బల్లలు ఏర్పాటు చేశారు. దీనిని ఓర్వలేని వైకాపా శ్రేణులు వాటిని ధ్వంసం చేశారని గౌసియాబేగం భర్త ఆదం వలీ ఆరోపించారు. ప్రశ్నించిన తనపై వైకాపా నేతలు దాడి చేశారని, దాడిలో తనకు తీవ్రగాయాలయ్యాయని తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన మరికొందరిని నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీచదవండి.