గుంటూరు జిల్లా అమరావతి మండలంలోని ఉంగుటూరు చెరుపు కట్టపై తెదేపా నేత, మాజీ సర్పంచ్ మేదరమెట్ల సోమశేఖర్... భారీగా మొక్కలు నాటాడు. ఇటీవల కాలంలో మొక్కల వద్ద ముళ్ల చెట్లు పెరిగిపోయింది. ఈ అంశంపై సోమశేఖర్ భార్య, ప్రస్తుత సర్పంచి మేదరమెట్ల అనురాధా... పంచాయతీ సమావేశం నిర్వహించారు. కంప చెట్లను తొలగించాలని తీర్మానించి లక్ష రూపాయల నిధులను కేటాయించారు.
ఈ క్రమంలో సోమవారం ముళ్ల చెట్లను తొలగించే పనులు ప్రారంభించారు. పనులను పర్యవేక్షించేందుకు మాజీ సర్పంచి సోమశేఖర్ వెళ్లగా... అదే గ్రామానికి చెందిన వైకాపా నేతలు రాయపాటి శివ, ధర్మేంద్రలు ఇక్కడకు ఎందుకు వచ్చావు అంటూ సోమశేఖర్‌తో వాగ్వాదానికి దిగి, దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమశేఖర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు.
ఇదీచదవండి.