గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో.. వైకాపా వర్గీయులు అలజడి సృష్టించారు. తెదేపా శ్రేణుల ఇళ్ల మీదకు వచ్చి.. కర్రలు, కత్తులతో దాడులకు పాల్పడ్డారు. నకరికల్లు మండలం కండ్లకుంటలో.. మాజీ సభాపతి స్వర్గీయ కోడెల శివప్రసాదరావు ద్వితీయ వర్దంతి గురువారం జరిగింది. ఈ సభకు వెళ్లారనే అక్కసుతోనే.. వైకాపా వర్గీయులు.. తమపై కర్రలు, కత్తులతో ఇళ్లలోకి వచ్చి తీవ్రంగా దాడులకు పాల్పడ్డారని తెదేపా శ్రేణులు ఆరోపించారు. మహిళలు అనికూడా చూడకుండా కొట్టారని ఆవేదన చెందారు.
ఈ దాడిలో ఆరుగురి తెదేపా వర్గీయులకు తీవ్రగాయ్యాలయ్యాయి. చికిత్స నిమిత్తం.. వారిని గ్రామస్థులు సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఇదీ చదవండి: NARA LOKESH: 'పోలీసు వ్యవస్థని ఫ్యాక్షన్ వ్యవస్థగా మార్చుకున్నారు..'