గుంటూరులోని ఐకే స్కేటింగ్ అకాడమీ క్రీడాకారులు అదిరే ప్రదర్శన చేశారు. కరోనా పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా విశాఖపట్నం నుంచి గుంటూరుకు రోడ్ రిలే స్కేటింగ్ ప్రదర్శనను విజయవంతంగా పూర్తి చేశారు. నిన్న ఉదయం విశాఖలో బయలుదేరిన స్కేటింగ్ క్రీడాకారులు రాజమండ్రి, ఏలూరు, విజయవాడ మీదుగా ఇవాళ ఉదయం గుంటూరు నగరానికి చేరుకున్నారు.
25 మందితో కూడిన స్కేటింగ్ బృందంలో చిన్నారులు సైతం ఉన్నారు. ఇది ప్రపంచ రికార్డుగా వజ్రా వరల్డ్ రికార్డు, అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో, యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డు వరల్డ్‌లో నమోదు కానుందని ఐకే స్కేటింగ్ అకాడమీ కోచ్ ఇమ్రాన్ చెప్పారు. 24 గంటల వ్యవధిలో నాన్ స్టాప్‌గా సుమారు 650 కిలోమీటర్లు పయణించామని.. ఇదో రికార్డు ప్రదర్శనని కోచ్ ఇమ్రాన్ పేర్కొన్నారు. 24 గంటల వ్యవధిలో రిలే ప్రదర్శన ద్వారా తాము గమ్యానికి చేరుకున్నామని ప్రదర్శనలో పాల్గొన్న క్రీడాకారులు చెప్పారు.
ఇదీ చదవండి: