గుంటూరు జిల్లాలో.. మండల కేంద్రమైన యడ్లపాడు ఎస్టీ కాలనీకి చెందిన మొగిలి శివపార్వతి (29).. ఇంట్లో ఉరివేసుకుని శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. కాలనీకి చెందిన ఆదినారాయణతో 10 సంవత్సరాల క్రితం శివపార్వతికి వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
తీవ్రమైన కడుపునొప్పితో బాధపడిన ఆమె శుక్రవారం నొప్పి తాళలేక ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. యడ్లపాడు ఎస్సై రాంబాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి:
పరిషత్ ఎన్నికలకు చేసిన ఖర్చును సీఎం ఇస్తారా?: చిల్లపల్లి శ్రీనివాస్