తమకు ఇళ్ల స్థలాల మంజూరులో అన్యాయం జరిగిందంటూ గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులోని పంచాయతీ కార్యాలయం ఎదుట మహిళలు ఆందోళనకు దిగారు. ఇళ్ల స్థలాల జాబితాలో తమ పేర్లు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది అనర్హులకు ఇళ్లు కేటాయించారని ఆరోపించారు.
తమకు న్యాయం చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మహిళలకు సద్దిచెప్పి అక్కడి నుంచి పంపేశారు.
ఇవీ చూడండి...