ETV Bharat / state

'ఎస్సై నమ్మించి మోసం చేశాడు...న్యాయం చేయండి' - ఎస్సై నమ్మించి మోసం చేశాడు

స్టేషన్​లో ఫిర్యాదు చేయటానికి వెళ్లిన తనతో ఎస్సై వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించారు. పెళ్లి కాలేదంటూ నమ్మించి మోసం చేశాడని ఆరోపించింది. విషయం ఆయన భార్యకు తెలిసే సరికి వేధిస్తున్నాడని మహిళా పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

'ఎస్సై నమ్మించి మోసం చేశాడు...న్యాయం చేయండి'

author img

By

Published : Jul 2, 2020, 5:40 PM IST

గుంటూరు జిల్లా ముప్పాళ్ల ఎస్సై జగదీశ్​పై నరసరావుపేట గ్రామీణ పోలీస్ స్టేషన్​లో ఓ మహిళ ఫిర్యాదు చేశారు. తన భర్తతో విభేదాల కారణంగా 2013లో నరసరావుపేట పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశానని అప్పుడే జగదీశ్​ పరియమైనట్టు తెలిపారు. మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడని వెల్లడించారు. మాట వినకుంటే తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తానని బెదిరించాడని ఆరోపించారు. విధిలేని పరిస్థితుల్లో ఆయనతో వివాహేతర సంబంధం కొనసాగించారని చెప్పుకొచ్చారు.

భర్తతో స్నేహం చేసి...

తన భర్తతోనూ ఎస్సై స్నేహం చేసి తరచుగా ఇంటికి వచ్చి వెళ్లేవాడని తెలిపిారు. ఎస్సై కారణంగా తనకు గర్భం వచ్చిన సంగతి తెలిసిన తన భర్త విడాకులు ఇచ్చాడని పేర్కొంది. అప్పుడు కూడా అతను పెళ్లి విషయం దాచి... ఓ గది అద్దెకు తీసుకుని సహజీవనం చేశాడని ఆరోపించింది. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తరువాత అసలు విషయం తనకు తెలిసిందన్నారు.

మెుదటి భార్యతో విభేదాలు తలెత్తి..

గత కొద్ది రోజులుగా జగదీశ్​ మొదటి భార్యతో విబేధాలు వచ్చాయని అప్పటి నుంచి తనను, బిడ్డను వేధిస్తున్నాడని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డతో సహా ఎక్కడికైనా వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారంటూ ఆరోపించారు. తనకు, బిడ్డకు ఎస్సై జగదీశ్ వల్ల ప్రాణహాని ఉందని తనకు న్యాయం చేయాలంటూ నరసరావుపేట గ్రామీణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. రక్షణ కల్పించాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.