ETV Bharat / state

పండుగకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం.. టిప్పర్ ఢీకొని మహిళ మృతి

ఆనందంగా పుట్టింటిలో సంక్రాంతి జరుపుకుని.. భర్త, కుమార్తెతో కలిసి స్వగ్రామనికి వస్తున్న మహిళను రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం చౌటపాపయపాలెంలో జరిగిన ఈ ఘటనలో.. మాచవరం మండలం మల్లవోలుకు చెందిన పుష్పావతి మరణించింది. 'లే అమ్మా' అంటూ మృతురాలి కుమార్తె విలపించడం చూపరులను కలిచి వేసింది.

road accident at chowtapapayapalem
చౌటపాపయపాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
author img

By

Published : Jan 17, 2021, 8:35 PM IST

చౌటపాపయపాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం చౌటపాపయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో.. మాచవరం మండలం మల్లవోలుకు చెందిన బండి పుష్పావతి మృతి చెందింది. ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టింది. మెడికొండూరు మండలం వరగనిలోని పుట్టింటి నుంచి భర్త, కుమార్తెతో కలిసి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. శరీరం గుర్తు పట్టలేని విధంగా ఛిద్రం కాగా.. మిగిలిన ఇద్దరూ స్పల్ప గాయాలతో బయటపడ్డారు.

సంక్రాంతి జరుపుకోవడానికి పుట్టింటికి వెళ్లిన పుష్పావతి కుటుంబం.. పండుగ అనంతరం ద్విచక్ర వాహనంపై మల్లవోలుకు బయలుదేరారు. టిప్పర్ ఢీకొట్టగానే ఆమె కిందపడిపోగా.. వాహనం ఆమె పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. 'అమ్మా లే అమ్మా! ఇంటికి పోదాం' అంటూ బాధితురాలి కుమార్తె విలపించడం.. చూపరులను కన్నీరు పెట్టించింది. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్​ని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

గుంటూరులోని ఆలయంలో చోరీ...కొన్ని గంటల్లోనే ఛేదించిన పోలీసులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.