భార్యపై అనుమానంతో గొంతు నులిమి చంపిన ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. సత్తెనపల్లి మండలం కట్టవారి పాలెంలో గాయత్రి అనే మహిళను ఆమె భర్త ఫిలిప్ హత్య చేశాడు. ఆ తర్వత తాను కూడా పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అతడిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం ఫిలిప్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గాయత్రితో ఫిలిప్‌కు 11నెలల క్రితం వివాహం జరిగింది. ఎపుడూ భార్యను వేధించేవాడని గాయత్రి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: అక్రమ లావాదేవీల కోసం అడ్డదారి తొక్కిన బ్యాంకు మేనేజర్