ETV Bharat / state

Love Marriage: నా భార్యను అప్పగించండి.. హెంమంత్రిని ఆశ్రయించిన బాధితుడు - My wife was forcibly abducted victim alligation

నవ వధువును ఆమె పుట్టింటి వారు బలవంతంగా ఎత్తుకెళ్లారని...ఈ మేరకు పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోవటంలేదని బాధితుడు వాపోయాడు. తనకు న్యాయం చేయాలంటూ కోరుతూ బాధితుడు హోంమంత్రి సుచరితను కలిసి వినతిపత్రం అందజేశాడు. స్పందించిన హోంమంత్రి.. విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు గుంటూరు జిల్లా కండ్రిగకు చెందిన బాధితుడు చందు తెలిపారు.

నా భార్యను బలవంతంగా ఎత్తుకెళ్లారు
నా భార్యను బలవంతంగా ఎత్తుకెళ్లారు
author img

By

Published : Jul 23, 2021, 8:25 PM IST

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం కండ్రిగ గ్రామానికి చెందిన చందు.. బేతపూడి గ్రామానికి చెందిన కౌసర్ అనెే మహిళ కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు. ఇద్దరివి వేర్వేరు కులాలు కావడంతో పెద్దలు వీరి ప్రేమను అంగీకరించలేదు. దీంతో ఈ నెల 19న గుంటూరులోని నెహ్రు నగర్ శేషాచలం ఆశ్రమంలో వివాహం చేసుకున్నారు. అనంతరం పెద్దల నుంచి తమను రక్షణ కల్పించాలని ఫిరంగిపురం పోలీసులు కోరారు. పోలీసులు వారి కుటుంబ సభ్యులను పిలిపించి.. మాట్లాడారు. ఇబ్బందులు పెట్టొద్దని నచ్చజెప్పి పంపించారు.

బలవంతగా ఎత్తుకెళ్లారు..

అయితే నవ దంపతులు స్టేషన్ నుంచి బయటకొచ్చి ఆటోలో వెళ్తున్న క్రమంలో యువతి బంధువులు కొందరు తమపై దాడి చేసి నా భార్యను బలవంతంగా ఎత్తుకెళ్లారని చందు పేర్కొన్నారు. యువతిని ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా చందు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే నాలుగు రోజులు గడుస్తున్నా.. తన భార్య జడ తెలియడం లేదని చందు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన భార్యకు ఏదైనా జరిగితే పోలీసులదే బాధ్యత వహించాలన్నాడు. నా భార్యను అప్పగించండి.

రాజకీయ ఒత్తిడితో పోలీసులు కేసును నీరుగారుస్తున్నారని చందు ఆరోపించాడు. తనకు న్యాయం చేయాలని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా తిరిగి ఫిరంగిపురం స్టేషన్​లోనే ఫిర్యాదు చేయాలని సూచించారన్నారు. స్టేషన్​లో తనకు న్యాయం జరగడం లేదని గ్రహించిన బాధితుడు చందు.. నేరుగా హోం మంత్రిని కలిసి తన గోడు చెప్పుకున్నాడు.

ఇదీ చదవండి..

Shivasri: న్యాయం కోసం ప్రశ్నిస్తే.. నిరాశ్రయురాలిగా మార్చారు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.