జాతిపిత మహాత్మా గాంధీ అడుగు జాడల్లో అందరూ నడవాలని గుంటూరు జిల్లా తాడికొండ శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన 'మనం మన పరిశుభ్రత' ప్రారంభోత్సవాన్ని మేడికొండూరు మండలం పేరేచర్ల పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.
గ్రామ స్వరాజ్యమే లక్ష్యం..
గ్రామ స్వరాజ్యమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామ సచివాలయాలు ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థ పనితీరు బాగుందని కితాబిచ్చారు.
రైతులకు భరోసా..
తమ సర్కార్ వ్యవసాయం, విద్య వైద్యరంగంలో ఎన్నో రకాల సేవలు అందిస్తోందని శ్రీదేవి అన్నారు. రైతు భరోసా పథకం వల్ల ఎంతో మందికి లబ్ధి చేకూరుతోందన్నారు. వైఎస్సార్ చేయూత ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. నాడు నేడు ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేశామని వివరించారు.
పోషకారం అందిస్తున్నాం..
అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు, గర్భిణులకు, బాధితులకు పోషకాహారం అందిస్తున్నామని శ్రీదేవి తెలిపారు. కొవిడ్-19 సమయంలో విధులు నిర్వర్తించిన పారిశుద్ధ్య కార్మికులను అభినందించారు. అనంతరం వారిని శాలువాతో సన్మానించి పండ్లు అందించారు. ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీదేవి ప్రారంభించి మనం మన పరిశుభ్రత ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ కరుణ కుమార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శోభారాణి, వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది: తెదేపా ఎమ్మెల్యే