ETV Bharat / state

ఓ వీఆర్వో.. లంచం తీసుకోవడానికి ఓ అసిస్టెంట్.. అడ్డంగా బుక్కయ్యారు - దుర్గి తహసీల్దార్ కార్యాలయం

రూ. 15వేలు లంచం డిమాండ్ చేసిన వీఆర్వోను.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పాసు పుస్తకానికి సంబంధించిన సమస్యను పరిష్కరించాలంటూ ఓ రైతు వీఆర్వోను కలవగా.. అతను లంచం డిమాండ్ చేశాడు. ఆ డబ్బును తన ప్రైవేటు అసిస్టెంట్​కు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నాడు.

vro cought by acb while taking the bribe in guntur

author img

By

Published : Jul 9, 2021, 9:28 PM IST

అతనో వీఆర్వో. రైతులు సమస్యలు పరిష్కరించమని వస్తే అతనిలోని లంచగొండి నిద్రలేస్తాడు. అతను డిమాండ్ చేసే లంచాన్ని తీసుకోవడానికి ఓ ప్రైవేటు వ్యక్తిని నియమించుకొని.. అతనికి నెలనెలా కొంత ముట్టజెపుతున్నాడంటే అర్థం చేసుకోవచ్చు అతని వసూళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో. గుంటూరు జిల్లాలో ఏసీబీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయాలు తెలిశాయి.

జిల్లాలోని దుర్గి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ రైతు వద్ద నుంచి 15 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ముటుకూరు-2 గ్రామ వీఆర్వో అందుగుల రాజారావు ఏసీబీ అధికారులకు చిక్కాడు. కంచరగుంట గ్రామానికి చెందిన బాల సైదారావు అనే రైతుకు మూడెకరాల పొలం ఉంది. దానిని పాసు పుస్తకంలో ఆన్​లైన్ చేసేందుకు వీఆర్వో రాజారావును కలిశాడు. అతను రూ.15వేలు లంచం డిమాండ్ చేశాడు. తన వద్ద పని చేస్తున్న చింత నాగమణికంఠకు ఆ డబ్బును ఇవ్వాలని రైతులు సూచించాడు. అంత డబ్బు ఇచ్చుకోలేని రైతు బాల సైదారావు గుంటూరు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

దుర్గి తహసీల్దార్ కార్యాలయంలో రైతు వద్ద నుంచి 15 వేల రూపాయల నగదును వీఆర్వో రాజారావు ప్రైవేటు అసిస్టెంట్ నాగ మణికంఠ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. వీఆర్వో రాజారావు తన వద్ద పని చేస్తున్న ప్రైవేటు అసిస్టెంట్ కు ప్రతి నెల 5వేల రూపాయలు ఇస్తున్నాడని ఏసీబీ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: corrona effect: కరోనాతో అంధుని తల్లిదండ్రులు మృతి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.