వినుకొండ పట్టణంలోని 23వార్డులో నివాసం ఉండే పఠాన్ సైదావలి స్థానికంగా చిన్నపాటి హోటల్‌ను నడుపుతున్నాడు. హోటల్ నడిపేందుకు స్థానికంగా నివాసం ఉండే స్టీఫెన్ బాబు, గాబ్రియల్ అలియాస్ వంశీ అనే వ్యక్తులు డబ్బులు డిమాండ్ చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. కొన్నాళ్లు సైదావలి డబ్బులు చెల్లించాడు. చివరికి... హొటల్ స్థలానికి అనుమతి లేదంటూ స్థానిక, జిల్లా అధికారులకు స్టీపెన్ బాబు, వంశీ ఫిర్యాదు చేశారు. హోటల్‌ను తొలగించాలని అధికారులు చెప్పారు.
జీవనాధారం దూరమవుతుందనే మనస్తాపంతో సైదావలి ఆత్మహత్యాయత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: