ETV Bharat / state

యాభై రూపాయల కోసం యువకుడు బలి.. నిందితులను అరెస్ట్ చేయాలంటూ కుటుంబీకుల ఆందోళన - sattenapalli latest news

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఈనెల 21న రూ.50కోసం.. వినియోగదారునికి, పాల దుకాణంలో పనిచేసే వ్యక్తికి.. ఘర్షణ జరిగింది. ఘటనలో పాల దుకాణంలో పనిచేసే బాజి అనే యువకుడు మృతిచెందాడు. అయితే ఇప్పటివరకు నిందితులపై చర్యలు తీసుకోలేదని మృతుని కుటుంబ సభ్యులు.. సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులు వచ్చి నిందితులను అరెస్టు చేస్తామని చెప్పిన తర్వాత.. వారు ఆందోళనను విరమించారు.

victim family protest in sattenapalli of guntur as culprits must be arrested in killing a person for Rs.50
యాభై రూపాయల కోసం యువకుడు బలి.. నిందితులను అరెస్ట్ చేయాలంటూ కుటుంబసభ్యుల ఆందోళన
author img

By

Published : Jan 30, 2021, 10:34 AM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఈనెల 21న వినియోగదారునికి, పాల దుకాణంలో పనిచేసే వ్యక్తికి జరిగిన ఘర్షణలో.. యువకుడు మరణించాడు. అయితే ఇప్పటి వరకూ నిందితుల్ని అరెస్టు చేయకపోవటాన్ని నిరసిస్తూ బాజి బంధువులు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. పాల దుకాణంలో పనిచేసే బాజీకీ, కోటేశ్వరరావు అనే వినియోగదారుని మధ్య.. రూ.50 కోసం వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత కోటేశ్వరరావు తన స్నేహితులతో వచ్చి బాజిపై దాడి చేయగా అతను మరణించాడు.

ఈ దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కేసును పోలీసులు నీరుగారుస్తున్నారని.. బాజీ బంధువులు ఆరోపించారు. ఘటన జరిగి తొమ్మిది రోజులైనా ఇంకా నిందితుల్ని అరెస్టు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. పోలీసులు బాజీ కుటుంబసభ్యులతో సంప్రదింపులు జరిపారు. నిందితుల్ని అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. చివరికి బాజీ కుటుంబీకులు, బంధువులు ఆందోళనను విరమించారు.

సంబంధిత కథనం:

యాభై రూపాయల పంచాయితీ.. యువకుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.