కొత్తగా ఏర్పడబోయే పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు. సెప్టెంబర్ 28న గుర్రం జాషువా 125వ జయంతిని పురస్కరించుకుని పల్నాడుకు ఆయన పేరు పెట్టాలని లేఖలో పేర్కొన్నారు. జాషువా తెలుగు కవిత్వాన్ని ఆదునీకరించడమే కాక వెనుకబడిన వర్గాలపై జరిగిన వివక్షను సమాజానికి తన కవిత్వం ద్వారా తెలియజేశారన్నారు. అణగారిన వర్గాలను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడంలో ఆయన కృషి మరువలేనిదన్నారు. పల్నాడు ప్రాంతంలోని వినుకొండలో జన్మించిన జాషువా పేరును ఆ ప్రాంతానికి పెడితే ఆయనకు ఘన నివాళి అర్పించినట్లు ఉంటుందని సూచించారు.
ఇవీ చదవండి...
'నా లేఖను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లండి... ఇదే చివరి కోరిక'