గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం బోరుపాలెం వద్ద 2 ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. అమరావతి నుంచి విజయవాడ వెళ్తున్న బస్సును.. విజయవాడ నుంచి అమరావతి వెళ్తున్న బస్సు ఢీకొంది. ఈ ఘటనలో మొత్తం 14 మందికి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను తుళ్లూరు ఆసుపత్రికి తరలించారు. బోరుపాలెం వద్ద రోడ్డు బాగాలేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: