హమాలీల ఆందోళనతో గుంటూరు జిల్లా దుగ్గిరాల యార్డులో నిలిచిన పసుపు కొనుగోళ్లు నిలిచిపోయాయి. మార్క్ ఫెడ్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో కూలీ రేట్లు ఖరారు చేయలేదు. క్వింటాకు రూ.36 ఇస్తామని మార్క్ ఫెడ్ అధికారులు చెప్పగా... రూ.40 ఇవ్వాలని హమాలీలు పట్టుబట్టారు.
కూలీ ఖరారు కాని కారణంగా.. పసుపు గ్రేడింగ్, కాటా పనులను ఆపేశారు. దీంతో కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభం కాలేదు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పసుపు తెచ్చిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తమకు గిట్టుబాటు ధర కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: