ETV Bharat / state

నాగార్జునసాగర్ ఉపఎన్నిక: తెరాస అభ్యర్థి నోముల భగత్ విజయం - నోముల భగత్​ లేటెస్ట్​ వార్తలు

తెలంగాణలోని నాగార్జునసాగర్ ఉపఎన్నికలో తెరాస అభ్యర్థి నోముల భగత్ విజయం సాధించారు. సమీప అభ్యర్థి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై గెలుపొందారు. భాజపా అభ్యర్థి రవి నాయక్​ డిపాజిట్​ కోల్పోయారు.

తెరాస అభ్యర్థి నోముల భగత్‌
తెరాస అభ్యర్థి నోముల భగత్‌
author img

By

Published : May 2, 2021, 4:37 PM IST

తెలంగాణలోని నాగార్జునసాగర్ ఉపఎన్నికలో తెరాస విజయం సాధించింది. కాంగ్రెస్‌ నేత జానారెడ్డిపై తెరాస అభ్యర్థి నోముల భగత్‌ విజయం సాధించారు. భాజపా అభ్యర్థి రవి నాయక్​ డిపాజిట్​ కోల్పోయారు. కౌంటింగ్​ ప్రారంభం నుంచి నోముల భగత్​ ఆధిక్యంలో కొనసాగారు. నోముల నరసింహయ్య అకాల మరణంతో నాగార్జునసాగర్​లో ఉప ఎన్నిక జరిగింది.

తెరాస నుంచి నరసింహయ్య తనయుడు నోముల భగత్​ పోటీ చేయగా, కాంగ్రెస్​ నుంచి ఆ పార్టీ సీనియర్​ నేత జానారెడ్డి, భాజపా నుంచి రవినాయక్​ బరిలో నిలించారు. గత నెల 17 పోలింగ్​ జరగగా.. ఈ రోజు జరిగిన లెక్కింపులో భగత్​ విజయం సాధించారు. 21 రౌండ్ల కౌంటింగ్‌ ముగిసేసరికి నోముల భగత్‌ తన ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డిపై 15,487 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 21 రౌండ్ల తర్వాత తెరాసకు 74,726 ఓట్లు, కాంగ్రెస్‌కు 59,239 ఓట్లు, భాజపాకు 6,365 ఓట్లు పోలయ్యాయి.

ఇదీ చదవండీ... అనంతపురంలో 14 మంది కొవిడ్ రోగులు మృతి.. ఆక్సిజన్ కొరతే కారణమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.