పొట్ట కూటి కోసం వేరొక జిల్లా నుంచి వలస వచ్చి పని చేసుకుంటూ ఉండగా... ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మరణించిన ఘటన గుంటూరు జిల్లా నగరం మండలంలో జరిగింది. నాగండ్ల వారి పాలెం గ్రామ శివారులో రొయ్యల చెరువులు ఉన్నాయి. అక్కడ సంవత్సర కాలంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 10 కుటుంబాలు చెరువులకు కాపలా కాస్తున్నాయి. పనిలో భాగంగా సర్వేశ్వరరావు (35) అనే వ్యక్తి గట్టు పై ఉన్న ట్రాక్టర్ ఎక్కి కూర్చొని ఉండగా... వాహనం ఒక్కసారిగా వెనకకు జారి మురుగు కాల్వలో పడింది. దీంతో ముందుగా ఆ వ్యక్తి బురదలో పడ్డాడు. వెంటనే ట్రాక్టర్ అతనిపై పడింది. ఈ ఘటనలో ఊపిరి ఆడక ప్రాణాలొదిలాడు. గమనించిన సమీప వ్యక్తులు వెంటనే రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఎనిమిదేళ్ల ఏళ్ళ కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు.
ఇవీ చదవండి...ప్రజల భయాన్ని సొమ్ము చేసుకుంటున్నారు