పొట్ట కూలి కోసం కడుపు చేతపట్టుకొని బతుకుదెరువు కొచ్చిన వలస కూలీల ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామంలో జరిగింది.
కర్నూలు జిల్లా దేవనకొండ మండలం బేతపల్లి నుంచి వలస కూలీలు బతుకుతెరువు కోసం అప్పాపురం వచ్చారు. 2 నెలల నుంచి మిరప పొలాల్లో రోజువారి కూలి పనులు చేసుకునేవారు. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో మిరపకాయలను తీసుకొచ్చేందుకు ట్రాక్టర్‌పై బయలుదేరారు. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించే క్రమంలో ట్రాక్టర్ ట్రక్కు అదుపు తప్పి నీటి ప్రవాహం లేని కాలువలో బోల్తా పడింది. ఘటనలో పాడే సుగాలి అక్కడికక్కడే మృతి చెందగా, శివన్న, సురేష్ మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: చదలవాడపై వైకాపా కార్యకర్తల దాడి