ETV Bharat / state

రాష్ట్రంలో 111 కరోనా కేసులు... ఒక్క రోజే 67 మందికి పాజిటివ్ - ఏపీలో కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. బుధవారం ఒక్కరోజే 67 మందికి కరోనా పాజిటివ్​ నిర్ధరణ అయింది. గుంటూరు జిల్లాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. కరోనా సోకిన వారిలో దిల్లీ వెళ్లొచ్చిన వారే అధికంగా ఉన్నారు.

total number of corona cases reached to 111 in ap

author img

By

Published : Apr 2, 2020, 5:09 AM IST

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి బుధవారం రాత్రి 10 గంటల వరకు కొత్తగా 67 కేసులు నమోదయ్యాయి. మంగళవారం రాత్రి వరకు 44 కేసులే ఉన్నా...తాజా కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 111కు చేరింది. దిల్లీలో మతపరమైన సమావేశానికి హాజరై వచ్చినవారు, వారి సన్నిహితుల వల్లే కేసులు ఇంత భారీగా పెరిగినట్లు అధికారిక సమాచారం. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా మెలిగినవారు వీరిలో ఉన్నారు. ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో అత్యధికంగా 20 మందికి వ్యాధి నిర్ధరణ అయింది.

జిల్లాకరోనా పాజిటివ్ కేసులు
గుంటూరు20
కడప15
కృష్ణా15
ప్రకాశం15
పశ్చిమగోదావరి14
విశాఖపట్నం11
తూర్పుగోదావరి9
చిత్తూరు6
నెల్లూరు3
అనంతపురం2
కర్నూలు1
మొత్తం111

1313 మందికి పరీక్షలు

రాష్ట్రంలో మంగళవారం రాత్రి 9 నుంచి బుధవారం రాత్రి 10 వరకు 67 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇప్పటివరకు మొత్తం 1313 మందికి పరీక్షలు నిర్వహించగా, 111 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దిల్లీ నుంచి వచ్చిన వారిలో 543 మందికి, వారి సన్నిహితులు 269 మందికి పరీక్షలు చేశారు. విదేశాల నుంచి వచ్చిన 218 మందికి, వారి సన్నిహితులు 140 మందికి పరీక్షలు నిర్వహించారు. వైరస్ లక్షణాలున్న మరో 143 మంది నమూనాలు సేకరించి పరీక్షలు చేశారు. దిల్లీ నుంచి వచ్చిన వారిని, వారికి సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి వైద్య సహాయం అందించడంపై జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

దిల్లీ నుంచి వచ్చిన వారి కోసం జల్లెడ

దిల్లీ నుంచి వచ్చిన వారి వల్ల రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరగటంతో యంత్రాంగం అప్రమత్తమైంది. దిల్లీ నుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా మెలిగిన వారి కోసం అన్ని జిల్లాల్లో జల్లెడ పడుతోంది. ఇలాంటి వారు 1085 మంది ఉన్నారని, వారిలో 21 మందిని తప్ప మిగతా అందరినీ గుర్తించామని ముఖ్యమంత్రి జగన్ బుధవారం సాయంత్రం ప్రకటించారు. ప్రభుత్వం వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తోంది. లక్షణాలు ఉన్నా... లేకపోయినా వారందరికీ వ్యాధి నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తోంది.

ఇదీ చదవండి: కన్నతల్లి మరణించినా.. విధుల్లోనే ఎస్​ఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.