- నాలుగేళ్లలో ఏం పని చేశామని ఓట్లు అడుగుతాం: ఆనం
MLA ANAM SESATIONAL COMMENTS : రాష్ట్ర ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా రాపూరులో ఏర్పాటు చేసిన వాలంటీర్లు, కన్వీనర్ల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఆవేదనకు గురయ్యారు. రోడ్ల గుంతలు పూడ్చలేకపోతున్నాం.. తాగడానికి నీళ్లు లేవని మండిపడ్డారు. నాలుగేళ్లలో ఏం పని చేశామని.. ప్రజలను ఓట్లు అడుగుతామన్నారు. ప్రాజెక్టులు కట్టమా? పనులు మొదలుపెట్టామా? పింఛన్లు ఇస్తే ఓట్లు వేస్తారా? అలా అయితే గత ప్రభుత్వమూ ఇచ్చిందని విమర్శించారు. ఇల్లు కడతామని లేఅవుట్లు వేసినా ఇప్పటికీ కట్టలేదని మండిపడ్డారు.
- ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ.. పెండింగ్ బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి
JAGAN MET PM MODI: విభజన హామీలతోపాటు.. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు గడిచినా.. ఇప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదని వివరించారు. దీల్లిలో ప్రధానితో సమావేశమైన సీఎం జగన్.. రాత్రికి హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు.
- టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. ఎస్సీ సెల్ నేతలను అడ్డుకున్న పోలీసులు
TDP SC CELL LEADERS PROTEST : ఎస్సీ వెల్ఫేర్ కార్యాలయ ముట్టడికి బయల్దేరిన తెలుగుదేశం SC సెల్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీనికి నిరసనగా.. జాతీయ రహదారిపై బైఠాయించగా పోలీసులు వారిని బలవంతంగా తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
- పెనుకొండలో దారుణం.. భార్యపై అనుమానంతో కొడుకును చంపిన తండ్రి
Child Murder: చేయి పట్టి నడిపించాల్సిన కన్న తండ్రి ఆ చిన్నారి పాలిట కాలయముడయ్యాడు. కన్న కొడుకునే తండ్రి అత్యంత కిరాతకంగా గొంతు నులిమి హత్య చేసిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో జరిగింది. అనుమానం పెనుభూతం అన్నట్లుగా భార్యపై అనుమానంతో కుమారుడు తనకు జన్మించలేదని అపోహతో కన్న తండ్రే కసాయివాడై కుమారున్ని చంపేశాడు.
- సోలార్ స్కామ్ 'లైంగిక వేధింపుల కేసు'లో మాజీ సీఎంకు క్లీన్ చిట్
సోలార్ స్కామ్ లైంగిక వేధింపుల కేసులో కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీకి ఊరట లభించింది. ఆయనకు క్లీన్చిట్ ఇస్తూ కోర్టులో సీబీఐ నివేదిక సమర్పించింది.
- చర్చిపై దాడి.. విగ్రహం ధ్వంసం.. హుండీని ఎత్తుకెళ్లిన దుండగులు
Karnataka Church Attack : కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కర్ణాటక మైసూరులోని సెయింట్ మేరీస్ చర్చిపై దాడి చేశారు. బేబీ జీసస్ విగ్రహంతో పాటు చర్చిలోని ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు.
- 8ఏళ్లకే పెళ్లి.. బాడీబిల్డింగ్‌తో సెకండ్ ఇన్నింగ్స్.. అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్
8ఏళ్లకే పెళ్లైనా సరే.. ఓ మహిళ తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని బాడీ బిల్డింగ్ రంగంలో రాణిస్తోంది. రాజస్థాన్‌కు చెందిన ఆ మహిళ.. తాజాగా థాయ్‌లాండ్‌లో జరిగిన 39వ అంతర్జాతీయ మహిళా బాడీ బిల్డింగ్ పోటీల్లో భారత్‌కు బంగారు పతకాన్ని తెచ్చిపెట్టింది. టైటిల్ గెలుచుకొని భారత్‌కు చేరుకున్న ఆమె.. సమాజంలో ఇంకా చాలా మార్పులు రావాల్సి ఉందని అభిప్రాయపడింది.
- స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
- హీరో సిద్ధార్థ్ తీవ్ర ఆవేదన.. ఆ అధికారులు వేధించారంటూ..
హీరో సిద్ధార్థ్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తెలియజేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే..బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఆట, ఓయ్, బొమ్మరిల్లు తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరో సిద్ధార్థ్. తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రేమకథా చిత్రలతో మెప్పించి ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నాడు.