- రేపు దిల్లీ వెళ్లనున్న సీఎం జగన్.. ఆ అంశాలపై ప్రధానితో చర్చ!
CM JAGAN DELHI TOUR : సీఎం జగన్ మరోమారు దేశ రాజధాని దిల్లీ వెళ్లనున్నారు. పోలవరం పెండింగ్ నిధులు విడుదల చేయాలని ప్రధాని మోదీని కోరునున్నట్లు సమాచారం.
- రంగా ఆశయాలు ముందుకు తీసుకెళ్లడంలో రాజీ ప్రసక్తే లేదు: కొల్లు రవీంద్ర
KOLLU RAVINDRA : మచిలీపట్నంలో టీడీపీ నేత కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా గుడివాడ బయలుదేరిన ఆయనను మధ్యలోనే అడ్డగించారు.
- పండగ సరుకుల పేరుతో మోసం.. రూ.4 కోట్లతో వాలంటీర్ ఉడాయింపు
Volunteer Fraud: సంక్రాంతి పండగకు సరుకులు ఇప్పిస్తానని చీటీలు కట్టించిన వాలంటీర్ మోసానికి పాల్పడింది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు నాలుగు కోట్ల రూపాయల వరకు వసూలు చేసి బాధితులకు కుచ్చు టోపి పెట్టింది. విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనలో.. మోసపోయామని తెలుసుకున్న బాధితులు ఆందోళనకు గురవుతున్నారు.
- సీపీఎస్ రద్దు చేసి ఒపీఎస్ అమలు చేయాలి: ఏపీటీఎఫ్
Teachers Protest for OPS : సీపీఎస్‌ను రద్దు చేసి ఒపీఎస్‌ను అమలు చేయాలని కోరుతూ.. ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఉద్యోగస్తులు దాచుకున్న సొమ్మును వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతినెలా ఒకటో తేదీన కచ్చితంగా జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
- కొవిడ్ మాక్‌డ్రిల్‌కు రంగం సిద్ధం.. 'బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి'
వివిధ దేశాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. దేశంలో కొవిడ్ వ్యాప్తి ఉద్ధృతమైతే ఎలా వ్యవహరించాలన్నదానిపై కేంద్రం సూచన మేరకు.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మాక్‌డ్రిల్ నిర్వహించనున్నాయి. మరోవైపు, బహిరంగ ప్రదేశాలు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్క్‌ను తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
- తల్లి చివరి కోరిక.. ICUలోనే పెళ్లి చేసుకున్న కూతురు.. జరిగిన రెండు గంటలకే..
చావు బతుకుల మధ్య ఉన్న తన కన్నతల్లి చివరి కోరిక నెరవేర్చేందుకు ఓ కుమార్తె.. ఆస్పత్రి ఐసీయూలోనే పెళ్లి చేసుకుంది. కానీ వివాహం జరిగిన రెండు గంటలకే ఆమె తల్లి చనిపోయింది. దీంతో కుటుంబమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. బిహార్‌లోని గయలో జరిగిందీ సంఘటన.
- జపాన్ను వణికిస్తున్న హిమపాతానికి 17 మంది బలి
జపాన్‌లో భారీగా మంచు కురుస్తోంది. సాధారణం కంటే మూడు రెట్లు అధికంగా హిమపాతం నమోదవుతోంది. ఫలితంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు.
- 40 కోట్ల ట్విట్టర్ యూజర్ల డేటా చోరీ.. సుందర్ పిచాయ్, డబ్ల్యూహెచ్ఓ సహా..
ట్విట్టర్‌కు సంబంధించిన 40 కోట్ల మంది వినియోగదారుల డేటాను చోరీ చేసినట్లు హ్యాకర్ తెలిపాడు. ట్విట్టర్ తన నుంచి ఈ డేటాను కొనుకోలు చేయవచ్చని చెప్పాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెలీ సైబర్ సంస్థ హడ్సన్ రాక్ వెల్లడించింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, డబ్ల్యూహెచ్‌వో, కేంద్ర సమాచారం మంత్రిత్వ శాఖ ట్విట్టర్ డేటా చోరీకి గురైనట్లు పేర్కొంది.
- శ్రీలంకతో సిరీస్.. రోహిత్-రాహుల్ ఔట్.. కేవలం టీ20కే కాదట వన్డే కూడా..
శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌లకు కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ దూరం కానున్నట్లు రెండు మూడు రోజుల నుంచి జోరుగా ప్రచారం సాగుతోంది. బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో రోహిత్ వేలికి గాయమైన సంగతి తెలిసిందే. ఇంకా గాయం నుంచి అతడు కోలుకోని కారణంగా ఇప్పుట్లో మ్యాచ్‌లు ఆడే పరిస్థితి లేదని అంటున్నారు.
- స్టార్ హీరో కూతురిపై ట్రోలింగ్.. ఆ పని చేసినందుకే!
ఓ బాలీవుడ్ స్టార్ హీరో కుమార్తె వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఆమె వేసుకున్న దుస్తులపై ట్రోలింగ్ జరుగుతోంది. బాలీవుడ్ నటులు అజయ్ దేవగణ్, కాజోల్ కుమార్తె నైసా దేవగణ్ ఆదివారం ముంబయిలోని ఓ పబ్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి క్రిస్మస్ పార్టీకి హాజరైంది. పార్టీ అనంతరం బయటకు రాగా ఫొటోగ్రాఫర్లు ఆమె చుట్టూ చేరి ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.