- రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన ఏపీటీఎఫ్
APTF Protest : వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఈనెల 26న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో శాంతియుత నిరసనలకు ఫెడరేషన్ నేతలు పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఫెడరేషన్ నేతలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
- అన్నవరంలో విషాదం.. ఉరేసుకుని అక్క, తమ్ముడు ఆత్మహత్య
కాకినాడ జిల్లా అన్నవరంలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఉరి వేసుకుని అక్క పోకల శ్రీదేవి (21), తమ్ముడు శివసత్య (18) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- దేశంలోనే అత్యధిక అప్పులు చేసిన సీఎంగా జగన్ చరిత్రలో నిలిచాడు: యనమల
TDP Yanamala on State Debts: దేశంలోనే అత్యధిక అప్పులు చేసిన ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచాడని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. అప్పులపై ముఖ్యమంత్రి బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. గతం కంటే తక్కువ అప్పులు చేశామని చెబుతున్నవి పచ్చి అబద్ధాలు అని మండిపడ్డారు.
- 'మై సెకండ్ వైఫ్ రెస్టారెంట్'.. రెండో పెళ్లి చేసుకున్న వారికి స్పెషల్ డిస్కౌంట్!
బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి తన హోటల్‌కు వినూత్నంగా 'మై సెకండ్ వైఫ్ రెస్టారెంట్' అని పేరు పెట్టాడు. రెండో వివాహం చేసుకున్నవారు తన హోటల్‌కు వస్తే ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఇలా ప్రత్యేక పేరు పెట్టడానికి ఓ కారణం ఉందని చెబుతున్నాడు ఆ హోటల్ యజమాని.
- అమెరికాలో మంచు తుపాను బీభత్సం 18 మంది మృతి
అమెరికా, కెనడాలకు మంచు తుపాను చుక్కలు చూపిస్తోంది. అత్యంత శీతలగాలలకు భారీగా మంచుగా కురవడం సహా ఎక్కడికక్కడ నీరు గడ్డకట్టిపోతోంది. మంచు, చలి తీవ్రతకు ఉష్ణోగ్రతలు మైనస్సుల్లోకి జారుకోగా దాదాపు 17 లక్షలకుపైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం. ప్రతికూల వాతావరణం కారణంగా 18 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.
- సరికొత్త ఆర్థిక ప్రణాళికతో 2023కు సిద్ధమా?
కొత్త ఏడాది సంబరాలు ప్రారంభం అయ్యాయి. రాబోయే ఏడాదిలో ఏం చేయాలన్నది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అంతకు ముందు ఈ ఏడాది పూర్తి చేయాల్సిన పనుల మాటేమిటి? వాటన్నింటినీ ఒకసారి సమీక్షించుకోవాల్సిన తరుణమిది. అవేమిటో తెలుసుకుందామాం.
- వామ్మో.. మెస్సి 'బిష్ఠ్'కు రూ.82 లక్షల ఆఫర్!
మెస్సి ప్రపంచకప్ ఫైనల్లో ధరించిన బిష్ఠ్కు భారీ డిమాండ్ వచ్చింది. ఓ పార్లమెంట్ సభ్యుడు రూ.8.5 కోట్లు ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు.ఫిఫా ప్రపంచకప్ ఫైనల్స్‌లో విజయం తర్వాత ఖతార్ చక్రవరి షేక్ తమీమ్ బిన్ హమద్ ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సికి 'బిష్ఠ్' అనే సంప్రదాయ వస్త్రాన్ని బహూకరించారు.
- వాజ్‌పేయీ బర్త్‌డే స్పెషల్.. 'మై అటల్ హూ' ఫస్ట్‌లుక్ రిలీజ్
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ బయోపిక్కు సంబంధించిన కొత్త అప్డేట్ వచ్చింది. ఆదివారం వాజ్‌పేయీ జయంతి సందర్భంగా చిత్ర నిర్మాతలు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.