Tomato is One of The Most Ordered Items Online: మార్కెట్లో తరచూ ధరల హెచ్చుతగ్గులతో టమాటా వార్తల్లో నిలుస్తుంటుంది. ఇప్పుడు మరోసారి టమాటా వార్తల్లోకి ఎక్కింది.తెలంగాణలోని హైదరాబాద్‌లో ఆహారం కాకుండా ఆన్‌లైన్‌లో ఎక్కువ ఆర్డర్లు ఇస్తున్నవాటిలో టమాటా ఒకటి కావడం విశేషం. 2022లో తెలంగాణ, హైదరాబాద్‌కు సంబంధించిన ఆన్‌లైన్ ఆర్డర్ విశేషాలను స్విగ్గీ గురువారం విడుదల చేసింది.
- తింటే చికెన్ బిర్యానీ తినాలంటున్నారు హైదరాబాద్ ఆహార ప్రియులు. ఉదయం మాత్రం ఇడ్లీనే ఇష్టపడుతున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చే వంటకాల్లో వరసగా మూడో ఏడాది బిర్యానీకే నగరవాసులు ఎక్కువగా మొగ్గుచూపారు.
- అత్యధికంగా ఆర్డర్ చేసిన మొదటి మూడు వంటకాల్లో చికెన్ బిర్యానీ, అప్రికాట్ డిలైట్, మటన్ బిర్యానీ నిలిచాయి.
- స్నాక్ డిషెస్‌లో ఇడ్లీ, మస్కాబన్, మసాలా దోశను ఎక్కువమంది ఇష్టపడుతున్నారు.
- అత్యధిక ఆర్డర్ చేసిన డెజర్ట్‌లలో అప్రికాట్ డిలైట్, డబుల్ కా మిఠా, ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్‌క్రీమ్ ఉన్నాయి.
- ఆహారం కాకుండా ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇస్తున్నవాటిలో శీతలపానీయాలు, పాల ఉత్పత్తులతో పాటు టమాటాలు ఉంటున్నాయి.
ఇవీ చదవండి: