కొవిడ్ మహమ్మారి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురుని బలి తీసుకుంది. గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన ఓ వ్యాపారి అత్తమ్మ గత నెల 29న మృతిచెందగా.. అతని భార్య 5 రోజుల క్రితం ప్రాణాలు విడిచింది.
కుమారులు విదేశాల్లో ఉండటంతో...
శుక్రవారం సాయంత్రం ఆ వ్యాపారి చికిత్స పొందుతూ మరణించాడు. దంపతుల కుమారులు విదేశాల్లో ఉండటంతో కడచూపు కోసం మార్చురీలోనే ఉంచారు. అనంతరం సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రం ప్రతినిధుల సహకారంతో వారి అంత్యక్రియలను పూర్తి చేశారు.
ఇదీ చదవండి: అంబులెన్స్, కారు ఢీ... ఓ వ్యక్తి మృతి.. ఇద్దరికి గాయాలు