గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డు వద్ద.. మిర్చి కూలీలతో వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. పది మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని.. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు ముప్పాళ్ల మండలం మాదల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, నాగరాజు, అలివేలుగా పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ... నేటి నుంచే అమలు