ETV Bharat / state

బాహాటంగా బెదిరింపులు... అభ్యర్థుల్లో భయాందోళనలు - రొంపిచర్ల మండలంలో పంచాయతీ ఎన్నికలు

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వారికి పలుచోట్ల బెదిరింపులు ఎదురవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో కనీసం నామినేషన్లు వేయడానికి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారు. నామపత్రాలతో వస్తే అంతు చూస్తామని హెచ్చరికలు చేస్తూ మరీ బెదిరింపులకు పాల్పడుతున్నారు. పోలింగ్‌ నాటికి ఇవి ఏ పరిణామాలకు దారితీస్తాయోనన్న ఆందోళన రాజకీయవర్గాల్లోనే కాదు.. పోలీసు యంత్రాంగంలోనూ వ్యక్తమవుతోంది. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం తురిమెళ్లలో తెదేపా మద్దతుదారు బుధవారం ఎస్పీ చొరవతో నామినేషన్‌ వేయాల్సిన పరిస్థితి నెలకొందంటే జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.

threats to candidates in the  elections at  Rompicharla zone
అభ్యర్థులతో ఎస్పీ విశాల్ గున్నీ
author img

By

Published : Feb 4, 2021, 2:25 PM IST

పంచాయతీ పోరులో బెదిరింపులు ఎక్కువవుతున్నాయి. నామినేషన్లు వేయడానికిి వెళ్తున్న వ్యక్తులనే ..బహిరంగంగా భయపెడుతున్నారు. ఎన్నికల వలన ఎప్పుడూ ఏం జరుగుతుందో అని సర్పంచుల అభ్యర్థులు కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. ఏవైపు నుంచి ఎవరూ వచ్చి దాడి చేస్తారనో అని భయపెడుతున్నారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం తురిమెళ్లలో తెదేపా మద్దతుదారు బుధవారం ఎస్పీ చొరవతో నామినేషన్లు వేశారు.

ఎస్పీ ఆదేశాలతో..

గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్‌గున్నీ నరసరావుపేట డివిజన్‌లో పర్యటించారు. నామినేషన్లను పురస్కరించుకుని పలు పంచాయతీల వద్ద బందోబస్తు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సిబ్బంది విధి నిర్వహణ ఎలా ఉందో ఆయన పరిశీలించారు. అందులో భాగంగా రొంపిచర్ల స్టేషన్‌ను సందర్శించారు. స్థానికంగా ఎస్పీ ఉన్నారని తెలుసుకుని తురిమెళ్ల గ్రామ తెదేపా మద్దతుదారులు కొందరు స్టేషన్‌కు వెళ్లి కలిశారు. తమను కనీసం నామినేషన్‌ వేయనీయడం లేదని ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన వెంటనే పోలీసు రక్షణ కల్పించి నామినేషన్‌ వేయించారు. ఇలా ఎంతమంది ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయగలరు? పోలీసుల సహకారంతో ఎంతమంది నామినేషన్లు వేయగలరో ఉన్నతాధికారులు గుర్తెరగాలని గ్రామాల్లో పెద్దలు అంటున్నారు. ఎవరైతే అడ్డుకుంటున్నారో వారిపై తక్షణమే కఠిన చర్యలకు ఉపక్రమిస్తే ఇలాంటివి పునరావృతం కావని చెబుతున్నారు.

పోలీసులు తమకు ఫిర్యాదులు వస్తే వాటిపై చర్యలు చేపడుతూ మెతకవైఖరిని అవలంభిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెనాలి డివిజన్‌లో నామినేషన్ల వేళ చెరుకుపల్లి మండలం రాంబొట్లపాలెంలో నామినేషన్‌ వేయడానికి వెళ్లిన అక్కల నాగమణి అనే అభ్యర్థినిని అడ్డుకున్నారు. కనీసం ఆమెకు నామపత్రాలు ఇవ్వకుండా యంత్రాంగం నిర్వాకాన్ని ప్రదర్శించిందని ఆమె ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదులో పేర్కొంది. మంగళవారం నరసరావుపేట మండలం ఇక్కుర్రులోనూ నామినేషన్‌ వేయడానికి బయల్దేరిన మహిళకు బెదిరింపులు రావడంతో ఆమె వెనుదిరిగారు. ఆమె భర్తపై మద్యం కేసు నమోదు చేసి జైలులో పెట్టారు.

నాదెండ్ల మండలం సాతులూరులో వార్డు మెంబర్‌గా పోటీ చేయడానికి వచ్చిన అభ్యర్థిని నుంచి అధికార పార్టీ నాయకుడొకరు నామపత్రాలు లాగేసుకుని చింపివేసి మరీ భయభ్రాంతులకు గురిచేశారు. ఏ గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. అర్ధరాత్రి వరకు అభ్యర్థుల ఎంపికలు, ప్రచారాలపై సమాలోచనలు సాగిస్తూ అరుపులు, కేకలతో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారని ఆయా గ్రామాల్లో ప్రజలు అంటున్నారు. మంగళవారం రాత్రి మేడికొండూరులో ఓ పార్టీ నేతల మధ్య సర్పంచి అభ్యర్థిత్వంపై తీవ్రస్థాయిలో తర్జనభర్జనలు జరిగాయి. చివరకు అరుపులు, కేకలు వేసుకుని సమీప వాసులకు కంటిమీద కునుకులేకుండా చేశారనే విమర్శలు వచ్చాయి.

ఆస్తుల విధ్వంసాలకు..

ప్రధాన పార్టీల మద్దతుతో పోటీ చేయాలనుకుంటున్న వారిని అడ్డుకోవడమే లక్ష్యంగా ఎవరికి వారు వ్యూహాలకు పదునుపెట్టడం ఒక ఎత్తయితే మరోవైపు ఆస్తుల విధ్వంసానికి తెగబడుతున్నారు. వైకాపా బలంగా ఉన్న ప్రాంతాల్లో తెదేపా నుంచి పోటీ తక్కువగానే ఉంటుంది. అదే తెదేపా బలం ఎక్కువ ఉన్న చోట వైకాపా మద్దతుదారులు సత్తా చాటేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇలాంటి చోట్ల ఘర్షణలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. డెల్టా, పల్నాడు ప్రాంతాల్లో అప్పుడే కొన్ని విధ్వంసకర ఘటనలు వెలుగుచూశాయి. రెండు రోజుల కిందట నాదెండ్ల మండలం అమీన్‌సాహెబ్‌పాలెంలో ద్విచక్ర వాహనం ఒకటి తగులబెట్టారు.

దీనికి కారకులెవరో గుర్తించలేదు. అదేవిధంగా మాచవరం మండలం తురకపాలెంలో తెదేపా కార్యకర్త షేక్‌ పెంటుకు చెందిన 5 ఎకరాల్లోని వరిగడ్డి వాముకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. బహిర్భూమికి వెళ్లినవారు గుర్తించి కేకలు వేయడంతో గ్రామస్థులు స్పందించి మంటలు ఆర్పారు. ఇలాంటి వాటికి పాల్పడేవారిని గుర్తించి తక్షణమే చర్యలకు ఉపక్రమించాలని.. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. నామినేషన్లు అడ్డుకునే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుచేస్తున్నారు.

ఇదీ చూడండి:

ఎన్నికల వరకే ఈ సమస్యలు.. తర్వాత అంతా ఒకటే: ఎస్ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.