Octopus force for CM Jagan's security: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు కొత్త ముప్పు ఉన్నట్టు ఇంటెలిజెన్స్ విభాగం పేర్కొంది. ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులతో ఆయనకు ముప్పు ఉందంటూ పేర్కొంది. ఇటీవల సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్రానికి పంపిన నోట్లో ఈ అంశాలను పేర్కొన్నారు. ఆయనకు వామపక్ష తీవ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు, వ్యవస్థీకృత నేరముఠాల నుంచి ముప్పు ఉందని.. జెడ్ ప్లస్ స్థాయి భద్రత కల్పించాల్సిందిగా ఈ నోట్లో స్పష్టం చేసింది.
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు కొత్త ముప్పు ఉన్నట్టు ఏపీ ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్దారించాయి. ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులతో ముప్పు ఉందనీ పేర్కొంటూ
రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి నోట్ పంపింది. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో సీఎం భద్రతకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి ఈ సూచనలు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులతో ముప్పు ఉందంటూ... రాష్ట్రప్రభుత్వం ఆ నోట్లో పేర్కొంది. ఇప్పటి వరకూ దేశంలోని ముఖ్యమంత్రుల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు మాత్రమే ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులతో ముప్పు ఉన్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రికి జెడ్ ప్లస్ స్థాయి భద్రత కల్పించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ముఖ్యమంత్రి జగన్‌కు వామపక్ష తీవ్రవాదులు, సంఘవిద్రోహ శక్తులు, ఐఎస్ఐ ఉగ్రవాదుల నుంచి భద్రత కల్పించాల్సి ఉందని కోరింది. వ్యవస్థీకృత నేర ముఠాల నుంచి కూడా ఆయనకు ముప్పు ఉందని స్పష్టం చేసింది.
ముకేశ్ అంబానీకి 'జెడ్ ప్లస్' సెక్యూరిటీ.. రక్షణగా 55 మంది..
జెడ్ ప్లస్ స్కేల్ భద్రత కల్పించే వ్యక్తిగా జామర్, బులెట్ ప్రూఫ్ కార్ ఇతర సెక్యూరిటీ బందోబస్తు కల్పించాలని ఏపీ ప్రభుత్వం కోరింది. అలాగే ఆయన ప్రయాణించే విమానానికి కూడా విమానాశ్రయంలో సాయుధులైన భద్రతా సిబ్బందితో కాపలా కావాలని కోరింది. వాస్తవానికి ముఖ్యమంత్రి జగన్ కు ఇప్పటికే సీఎం సెక్యూరిటీ వింగ్‌కు చెందిన భధ్రతను రాష్ట్రప్రభుత్వం కల్పిస్తోంది. దీనికి బాహ్యవలయంగా ఆక్టోపస్ దళానికి చెందిన 32 మంది గార్డులు ఆయనకు భద్రత కల్పిస్తున్నారు.
ఆ కమాండోలకు బ్యాండ్ బాజాతో స్వాగతం
ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి గానూ ఏపీలో ఆక్టోపస్ కమాండో గ్రూప్ ను ఏర్పాటు చేశారు. అయితే 2019 డిసెంబర్ 18వ తేదీన ముఖ్యమంత్రి జగన్ కు వ్యక్తిగత భద్రత కల్పించేలా అక్టోపస్ కమాండోలను నియమించింది. సీఎం భద్రతకు సంబందించి ఎప్పటికప్పుడు డీజీపీ అధ్యక్షతన ఉన్నతాధికారుల బృందం సమీక్షిస్తుంది. రక్షణ కల్పించాల్సిన ఆవశ్యకతను ఆధారం చేసుకుని సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యమైన వ్యక్తులకు భద్రత కల్పిస్తారు. దీనికోసం ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ కు చెందిన సిబ్బందిని ప్రభుత్వం నియమిస్తుంది. ముఖ్యమంత్రి భద్రత కోసం ప్రత్యేకంగా సీఎం సెక్యురిటీ వింగ్‌ను ఏర్పాటు చేశారు. సీఎం సెక్యురిటీ వింగ్ అంతర్గత వలయంలోనూ, అక్టోపస్ బాహ్య వలయంలోనూ ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ కు భద్రత కల్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల లేఖకు కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాల్సి ఉంది.