గుంటూరు జిల్లా చేబ్రోలులోని పదో వార్డులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 4 పోలింగ్ కేంద్రాలుండగా.. సుమారు 4 వేల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే కొన్నేళ్లుగా ఈ బడి భవనం శిథిలావస్థలో ఉంది. ఇక్కడికి వెళ్లేందుకే జంకే పరిస్థతి ఉంది.
ఇటీవల ఈ పాఠశాల ప్రాంగణంలోని ఒక భవనం పైకప్పు కూలిపోయింది. ఈ కారణంగా.. ఆ భవనం మొత్తంపై పరదా కప్పారు. స్థానికులకు ఫిర్యాదు చేసినా.. అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. సమస్యపై... ఎంపీడీఓ సుధారాణి మాట్లాడుతూ ప్రస్తుతానికి సమయం లేనందున ఎన్నికల నిర్వహణకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నామని.. త్వరలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నాటికి సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పోలింగ్ కేంద్రాన్ని మార్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇదీ చదవండి: