గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల జంక్షన్‌లోని మూడు దూకాణాల్లో చోరీకి పాల్పడ్డ దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. ఆగస్టు 26న పేరిచర్ల జంక్షన్లో ఉన్న మూడు దుకాణాల తాళాలు పగలగొట్టి.. సుమారు 20 వేల రూపాయలు దోచుకున్నారు.
ఫిరంగిపురం మండలం గొల్లపాలెేనికి చెందిన నక్క జ్యోతి బాబు.. గుంటూరు మిర్చి యార్డ్ సమీపంలో ఉంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన నారాబోయిన రమేశ్‌తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు పగలు వీధుల వెంట తిరుగుతూ ప్లాస్టిక్ వ్యాపారం చేస్తూ.. దుకాణాలు ఎంచుకుంటారు. రాత్రి వీలు చూసుకుని ఆ దుకాణాల్లో చోరీ చేస్తారు.
ఇదీ చదవండి: ఎఫ్ఆర్బీఎం పెంపుపై ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో ప్రభుత్వం