ETV Bharat / state

వీర సింహారెడ్డి సినిమా విడుదల... తెలుగు రాష్ట్రాల్లో దద్దరిల్లిన థియేటర్లు - Andhra Pradesh Latest News

Veerasimha Reddy movie: ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా విడుదల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది.. వీరసింహారెడ్డి చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానుల కోలాహలం నెలకొంది. తమ అభిమాన కథానాయకుడు చిత్రాన్ని వీక్షించేందుకు ఉదయాన్నే థియేటర్ల వద్ద బారులు తీరారు.

Veerasimha Reddy
వీర సింహారెడ్డి సినిమా విడుదల... తెలుగు రాష్ట్రాల్లో దద్దరిల్లిన థియేటర్లు
author img

By

Published : Jan 12, 2023, 1:46 PM IST

  • అమెరికా

అమెరికాలోని చార్లోట్టే నగరంలో వీరసింహారెడ్డి విడుదల సందర్భంగా బాలయ్య అభిమానులు వీరాభిమానం చాటారు. సినిమా విడుదల సందర్భంగా కేక్ కట్ చేసి సందడి చేశారు. ఖండాంతరాల్లో ఉన్నా తమ అభిమానాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరంటూ జై బాలయ్య నినాదాలు చేశారు .వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య రెండు సినిమాలు ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

  • తిరుపతి

తిరుపతి నగరంలో ఫ్యాన్‍ షోలను ఏర్పాటు చేయడంతో కొబ్బరికాయలు కొట్టి బాణాసంచా కాలుస్తూ... సందడి చేశారు. జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ... చిత్రానికి స్వాగతం పలికారు.

  • అనంతపురం

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 107 వ చిత్రం వీరసింహారెడ్డి ఇవాళ విడుదలైంది. అనంతపురం జిల్లాలో అభిమానులు.. థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున సందడి చేశారు. ఉదయం ఐదు గంటలకే ఫ్యాన్స్​ షో ప్రారంభమవగా అభిమానులు ఉత్సాహంగా తిలకించారు. బాలయ్య అభిమానులు గర్వపడేలా, రాయలసీమ ప్రాంత ప్రేమాభిమానాలను ఈ చిత్రంలో చూపించారని అభిమానులు చెప్పారు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని తెలిపారు. చిత్రంలోని డైలాగులతో నందమూరి తారక రామారావును గుర్తుచేసేలా ఉన్నాయని చెప్పారు. నేటి రాజకీయ పరిస్థితులపై చిత్రంలో స్పష్టంగా చూపించారని తెలిపారు. థియేటర్ల వద్ద టపాసులు పేలుస్తూ రంగులు చల్లుకుంటూ అభిమానులు సందడి చేశారు.

  • నందిగామ

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అగ్ర హీరో బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా ప్రదర్శించట్లేదని బాలకృష్ణ అభిమానులు ఆందోళన చేపట్టారు. స్థానిక విజయ టాకీస్​లో ఉదయం 6 గంటలకే బెనిఫిట్ షో ఉంటుందని థియేటర్ ప్రతినిధులు టిక్కెట్లు విక్రయించారు. ఒక్కొక్క టిక్కెట్టు 500 రూపాయలకు అభిమానులు ప్రేక్షకులు కొనుగోలు చేశారు. ఉదయం 6 గంటలకు అలా సినిమా ప్రదర్శిస్తామని చెప్పటంతో అభిమానులు పెద్ద ఎత్తున స్థానిక విజయ టాకీస్ వద్దకు చేరుకున్నారు. సమయం 7:00 అవుతున్నా సినిమా ప్రదర్శించకపోగా గేట్లు మూసేయడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెనిఫిట్ షోకు అనుమతులు లేకుండా ప్రదర్శించడానికి వీల్లేదని పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం.

  • హిందూపురం

శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి విరసింహారెడ్డి సినిమా విడుదల మొదటి ఆట అభిమానుల కోలాహలంతో పండుగ వాతావరణం నెలకొంది జై బాలయ్య జై జై బాలయ్య అన్న నినాదాలు హోరెత్తాయి సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా హిట్ కొట్టిన సందర్భంగా అభిమానులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలకు అవధులు లేకుండా పోయాయి.

  • విజయవాడ

వీరసింహారెడ్డి సినిమా ధియేటర్ వద్ద కేశినేని చిన్ని కేక్ కట్ చేసి విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. సినిమా ఘన విజయం సాధించిందని ఓవర్సీస్ లో బాలకృష్ణ సినీ కెరీర్ లో అతిపెద్ద హిట్టుగా నిలిచింది అన్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు తన వ్యాపార భాగస్వామిలని సినిమాను అద్భుతంగా నిర్మించారని తెలిపారు. ప్రస్తుత రాజకీయ నాయకులను ఉద్దేశించి బాలకృష్ణ చెప్పిన డైలాగులు బాగున్నాయని అవి ఒక బాలకృష్ణకే సాధ్యమన్నారు. సంక్రాంతి పండుగకు బాలకృష్ణ అందించిన చిత్రం వీర సింహారెడ్డి అభిమానులకు ముందే సంక్రాంతి వచ్చిందన్నారు.

  • పాడేరు

తెలుగు సినిమా హీరోబాలకృష్ణ సినిమా వీర నరసింహారెడ్డి తిలకించిన ఫ్యాన్స్అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు వెంకటేశ్వర థియేటర్ వద్ద సందడి చేశారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ వచ్చినట్లేనని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. సినిమా ఇంటర్వెల్ లో బయటికి వచ్చిన తమ హీరో బాలకృష్ణ డైరెక్టర్ బోయపాటి శ్రీను పై ప్రశంసలు వర్షం కురిపించారు.

వీర సింహారెడ్డి సినిమా విడుదల... తెలుగు రాష్ట్రాల్లో దద్దరిల్లిన థియేటర్లు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.