ETV Bharat / state

ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ...5 లక్షల విలువైన మద్యం అపహరణ !

ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీకి పాల్పడి 5 లక్షల విలువైన మద్యం అపహరించిన ఘటన గుంటూరు జిల్లా నరసారావుపేటలో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా...విచారణ జరిపి నిందితులను పట్టుకుంటామని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు.

ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ
ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ
author img

By

Published : Apr 4, 2020, 3:25 PM IST

గుంటూరు జిల్లా నరసారావుపేట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వం మద్యం దుకాణంలో చోరీ జరగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 22న దేశవ్యాప్తంగా విధించిన జనతా కర్ఫ్యూ సందర్భంగా ఎక్సైజ్ అధికారులు దుకాణాన్ని సీజ్ చేశారు. ఆ సమయంలో దుకాణంలో 50 లక్షల విలువైన మద్యం నిల్వలు ఉన్నట్లు అధికారులకు నివేదిక అందింది. అయితే గత నెల 26న దుకాణంలో చోరీ జరగినట్లు అధికారులు గుర్తించారు. ఆ సమయంలో దుకాణంలోని సీసీ కెమరాలను పని చేయకుండా చేసి చోరీకి పాల్పడగా...సమీపంలోని లాడ్జ్​కు సంబంధించిన సీసీ కెమరాల్లో దుండగుల కదలికలు రికార్డయ్యాయి. చోరీ ఘటనపై విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సూపరింటెండెంట్​ స్పష్టం చేశారు.

ఇదీచదవండి

ఆ 3 కేటగిరీల ఉద్యోగులకు శుభవార్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.