ETV Bharat / state

'రాజధానిపై విచారణను సీబీఐకి అప్పగించే అవకాశముంది' - ఏపీ రాజధాని వార్తలు

అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు నిలిపివేయటంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిందని న్యాయవాది లక్ష్మీనారాయణ వెల్లడించారు. నిర్మాణ ఖర్చులు, పనులు ఆగిపోవటం వలన జరిగిన నష్టంపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.

lawyer lashmi narayana
lawyer lashmi narayana
author img

By

Published : Aug 6, 2020, 3:31 PM IST

మీడియాతో న్యాయవాది లక్ష్మీనారాయణ

రాజధాని నిర్మాణాలు ఆపివేయటంపై హైకోర్టు వ్యాఖ్యలు చూస్తుంటే భవిష్యత్తులో ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని న్యాయవాది లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలు తరలింపు, రాజధాని బిల్లులకు సంబంధించి దాఖలైన పిటిషన్లను గురువారం హైకోర్టు విచారించింది.

రాజధాని నిర్మాణాలు ఆపివేయటం సరికాదని.. విచారణలో భాగంగా హైకోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికే వేల కోట్ల రూపాయల ప్రజాధనం రాజధాని కోసం ఖర్చు చేశారని... పనులు నిలిపివేసిన కారణంగా నిధులు దుర్వినియోగం అయ్యాయని కోర్టు చెప్పింది. మొత్తం వ్యవహారంపై అకౌంటెంట్ జనరల్​తో విచారణ చేయిస్తామని కోర్టు చెప్పింది. అకౌంటెంట్ జనరల్ సంబంధిత నిపుణులతో విచారణ జరపవచ్చు. లేదంటే విచారణను సీబీఐకి హైకోర్టు అప్పగించే అవకాశాలు ఉన్నాయి- లక్ష్మీనారాయణ, హైకోర్టు న్యాయవాది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.