రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన విద్యా సంస్కరణలు మున్సిపల్ పాఠశాలల అభివృద్ధిని విస్మరించేలా ఉన్నాయని పురపాలక ఉపాధ్యాయుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ ఆరోపించారు. కేవలం పంచాయతీ పాఠశాలలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే కొత్త విధానం రూపొందించారని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామీణ పాఠశాలల లక్ష్యాలు.. పట్టణాల్లోని పురపాలక పాఠశాల లక్ష్యాలు వేరుగా ఉంటాయన్నారు. కనీసం పురపాలక విద్యాశాఖ అధికారుల సలహలు కూడా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో కిలోమీటర్ పరిధిలో పాఠశాల ఏర్పాటు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. కొన్ని మురికివాడల్లో 20 ఏళ్లుగా పాఠశాలలు లేవన్నారు. దీంతో అక్కడి పిల్లలు విద్యకు దూరంగా ఉంటున్నారని తెలిపారు.
ఇదీ చదవండి