కరోనా వైరస్ సోకి మృతి చెందిన పాత్రికేయుడు మనోజ్ కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. మనోజ్ మృతికి సంతాపం తెలియజేస్తూ.. తన నివాసంలో కొవొత్తులు వెలిగించి నివాళులర్పించారు. వైద్యులు, నర్సులు, పోలీసులకు ఇస్తున్న బీమా సదుపాయాన్ని పాత్రికేయులకు కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
జర్నలిస్ట్ మనోజ్ మృతికి సంతాపం తెలియజేస్తూ పార్టీ కార్యాలయంలో జనసేన నాయకుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ప్రజలకు సమాచారం అందించే పాత్రికేయులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. తమ పార్టీ అధినేతతో చర్చించి జనసేన పార్టీ తరఫున మనోజ్ కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామన్నారు.
ఇవీ చదవండి