ETV Bharat / state

Smart Meters: ప్రజలపై అదానీ స్మార్ట్​ షాక్​.. మీటర్ల ఏర్పాటు, నిర్వహణల పేరిట రూ.29వేల కోట్ల భారం - ఆంధ్రప్రదేశ్​ తాజా వార్తలు

Smart Shock to AP People: ఆంధ్రప్రదేశ్‌లో గృహ, వాణిజ్య విద్యుత్‌ వినియోగదారులపై 29వేల కోట్ల రూపాయల మేర భారం మోపేందుకు వైసీపీ సర్కారు సిద్ధమైంది. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు.., నిర్వహణ పేరిట ప్రజలపై ఈ భారం వేసేందుకు సమాయత్తమైంది. గృహ వినియోగదారులపై ఏటా 18వందల 40 రూపాయలు., వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లపై 2వేల 902 రూపాయల మేర అదనంగా వసూలు చేసేందుకు అడుగులు వేస్తోంది.

Smart Meters
Smart Meters
author img

By

Published : May 18, 2023, 12:12 PM IST

ప్రజలపై అదానీ స్మార్ట్​ షాక్​.. మీటర్ల ఏర్పాటు, నిర్వహణల పేరిట రూ.29వేల కోట్ల భారం

Smart Shock to AP People: వైసీపీ ప్రభుత్వం విద్యుత్‌ వినియోగదారులను.. మరోసారి భారీగా బాదేసేందుకు సిద్ధమవుతోంది. స్మార్ట్‌ మీటర్ల పేరుతో ఏకంగా.. 29 వేల కోట్ల భారం మోపనుంది. గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులనే తేడా లేకుండా.. అందరికీ వడ్డించబోతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ట్రూ అప్‌ ఛార్జీలు, శ్లాబుల్లో మార్పులు, ఛార్జీల పెంపు ద్వారా ఇప్పటి వరకు వినియోగదారులపై.. 12 వేల కోట్లకు పైగా భారం మోపిన ప్రభుత్వం, ఈసారి నొప్పి తెలియకుండా వాతలు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రతి నెలా.. కొంత చొప్పున సుమారు ఎనిమిదేళ్ల పాటు.. ఈ భారం వేయనుంది.

ఒక్కో గృహ విద్యుత్‌ వినియోగదారునిపై ప్రతి నెలా 153రూపాయల 40పైసలు చొప్పున ఏడాదికి 18 వందల40 రూపాయల భారాన్ని మోపనుంది. వాణిజ్య., పారిశ్రామిక విద్యుత్‌ వినియోగదారులపై ప్రతి నెలా 241 రూపాయల90 పైసలు చొప్పున ఏడాదికి 2వేల 902 రూపాయల 80పైసలు భారం వేయనుంది. గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్‌ కనెక్షన్లకు.. మీటర్ల ఏర్పాటు, నిర్వహణకు కేంద్రం ఇచ్చే రాయితీతో కలిపి.. 31వేల 583.17 కోట్లను ఖర్చు చేయడానికి సిద్ధమైంది. ఈ పనులకు ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులైన అదానీ సంస్థ దక్కించుకోవడంతో ఒప్పందం పూర్తయ్యే వరకు ధరల వివరాలు బయటకు పొక్కకుండా.. జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఆ సంస్థకు మరోసారి దోచిపెట్టడమే లక్ష్యంగా.. ప్రజలపై పడే భారాన్ని కూడా లెక్కచేయకుండా.. స్మార్ట్‌ మీటర్ల వ్యవహారంలో ప్రభుత్వం ముందుకెళ్తోంది. దీనికి సంబంధించిన టెండరు ప్రక్రియను డిస్కంలు చేపట్టాయి. L-1గా నిలిచిన అదానీ సంస్థతో ఒకటి, రెండు రోజుల్లో ఒప్పందం కుదుర్చుకునే దిశగా.. ప్రయత్నాలు జరుగుతున్నాయి. గుత్తేదారు సంస్థ బిడ్‌లో కోట్‌ చేసిన ధర ఎక్కువగా ఉందని., ఆ మొత్తాన్ని కొంత తగ్గించాలని డిస్కంలు చేసిన సంప్రదింపులూ ఫలించలేదని సమాచారం.

టెండర్ల వ్యవహారంలో గుట్టు: గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్‌ కనెక్షన్లకు.. విద్యుత్‌ పంపిణీ సంస్థల పునఃవ్యవస్థీకరణ పథకం-RDSS కింద స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయాలని.. ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని సుమారు 1.96 కోట్ల విద్యుత్‌ కనెక్షన్లకు దశల వారీగా.. స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా మొదటి దశలో 27 లక్షల కనెక్షన్లకు, రెండో దశలో మరో 25 లక్షల కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయాలని.. డిస్కంలు నిర్ణయించాయి. తొలి దశ మీటర్ల ఏర్పాటుకు.. గత డిసెంబరులో టెండర్లు పిలిచాయి.

మూడు సంస్థలు బిడ్లు దాఖలు చేస్తే.. అదానీ L1గా నిలిచింది. ఒక్కో సింగిల్‌ ఫేజ్‌ మీటర్‌ ఏర్పాటుకు అదానీ సంస్థ బిడ్‌లో కోట్‌ చేసిన ధర ఎంత..? పరిశ్రమలకు ఏర్పాటు చేసే త్రీఫేజ్‌ మీటర్ల ఏర్పాటుకు ప్రతిపాదించిన ధర ఎంతనే వివరాలు... బయటకు పొక్కకుండా డిస్కంలు.. అత్యంత రహస్యంగా ఉంచాయి. బిడ్‌లో కోట్‌ చేసిన ధరల వివరాలను విశ్వసనీయ వర్గాల ద్వారా ఈనాడు సేకరించింది.

కేంద్రం నిర్దేశించిన మొత్తం కంటే.. రెట్టింపు భారం: RDSS పథకం కింద.. కేంద్రం ఒక్కో మీటర్‌ ఏర్పాటు, నిర్వహణకు 6 వేలు చొప్పున ధర నిర్ణయించింది. అదానీ కోట్‌ చేసిన ధర ప్రకారం ఒక్కో మీటర్‌ ఏర్పాటు, 93 నెలల నిర్వహణకు.. 14వేల 266 రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. ఇది కేంద్రం నిర్దేశించిన దాని కంటే.. 2.37 రెట్లు అధికం. మూడు డిస్కంల పరిధిలో సుమారు 1.52 కోట్ల గృహ విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా.. ఒక్కో మీటర్‌కు 153రూపాయల 40పైసలు చొప్పున నెలకు 233.17 కోట్ల భారాన్ని.. వినియోగదారులు భరించాలి. ఈ లెక్కన 93 నెలల్లో చెల్లించే మొత్తం 21వేల 684.62 కోట్లు. ఇందులో కేంద్రం రాయితీ 2వేల52 కోట్లు వస్తుంది. దీన్ని మినహాయిస్తే ప్రజలపై పడే భారం..19వేల 632.62 కోట్లు.

వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్‌ కనెక్షన్లకు త్రీఫేజ్‌ మీటర్‌ ఏర్పాటు, నిర్వహణకు ఒక్కో మీటర్‌కు 241 రూపాయల 90పైసలు చొప్పున.. గుత్తేదారు సంస్థకు చెల్లించాలి. ఈ లెక్కన రాష్ట్రంలోని సుమారు 44 లక్షల విద్యుత్‌ కనెక్షన్లకు నెలకు.. 106.44 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రకారం 93 నెలలకు 9వేల 898.55 కోట్లు.. గుత్తేదారు సంస్థకు చెల్లించాల్సి వస్తుంది. ఇందులో కేంద్రం ఇచ్చే రాయితీ 594 కోట్లు పోను.. 9వేల 304.55 కోట్ల భారాన్ని వినియోగదారులు భరించక తప్పదు.

అయిదేళ్ల నిర్వహణ రుసుములు అదానికే మిగులు: టెండరు నిబంధన ప్రకారం బిడ్‌ దక్కించుకున్న సంస్థ.. స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేయడంతో పాటు 93 నెలల పాటు నిర్వహణ, మీటర్‌ రీడింగ్‌ నమోదు, క్లౌడ్‌ మేనేజ్‌మెంట్‌ చేయాల్సి ఉంది. సింగిల్‌ ఫేజ్‌ మీటర్‌ ఏర్పాటుకు నెలకు.. 130 చొప్పున బిడ్‌లో పేర్కొంది. దీనికి 18శాతం జీఎస్టీ కలిపితే.. ఒక్కో మీటర్‌కు నెలకు 153రూపాయల 40పైసలు చొప్పున చెల్లించాలి. అంటే ఏడాదిలో పడే భారం.. 18వందల40 రూపాయల 80 పైసలు. వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్‌ కనెక్షన్లకు ఒక్కో త్రీఫేజ్‌ మీటర్‌ ఏర్పాటుకు 205 రూపాయల చొప్పున బిడ్‌లో కోట్‌ చేసింది. దీనికి జీఎస్టీతో కలిపి.. ఒక్కో వినియోగదారునిపై పడే భారం నెలకు 241 రూపాయల 90 పైసలు. ఏడాదికి.. 2వేల 902 రూపాయల 80 పైసలు. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకయ్యే ఖర్చులో కేంద్రం రాయితీ పోను.. మిగిలిన మొత్తాన్ని వినియోగదారుల నుంచే వసూలు చేస్తామని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ఈ మొత్తం.. ప్రతి నెలా విద్యుత్‌ బిల్లులో కలిపి వస్తుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.