గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం 33 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా.. 2 గేట్లు ఎత్తి 33 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తికి 13 వేల క్యూసెక్కుల నీటిని మళ్లించారు. పులిచింతల పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. జలాశయంలో ప్రస్తుతం 33 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇటీవల గేటు కొట్టుకుపోయిన కారణంగా.. జలాశయంలో పూర్తిస్థాయిలో నీరు నింపటం లేదు. ఇప్పటికీ మరమ్మతులు చేస్తున్నారు.
ఈ పనులను ఉన్నతాధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మరమ్మతు పనులు పూర్తయ్యే వరకూ ప్రాజెక్టులో 49 మీటర్ల లోపు మాత్రమే నీటిని నిల్వ చేయాలని నిర్ణయించారు. నీటిమట్టాలు అంతకు మించితే దిగువకు విడుదల చేస్తున్నారు. గేటు ప్రమాదానికి కారణాలతో పాటు.. ప్రాజెక్టుకు సంబంధించి నాణ్యతా ప్రమాణాలపై నివేదిక వచ్చిన తర్వాతే జలాశయంలో నీరు పూర్తిగా నింపుతామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
Pulichintala project: నిర్వహణ, నిర్మాణ లోపాలతోనే పులి 'చింత'ల!