గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం మంగలగిరిపాడు గ్రామంలో కన్న బిడ్డలే తల్లిని ఇంటి నుంచి బయటకు గెంటేశారు. వృద్దాప్యంలో అండగా ఉంటూ బాగోగులు చూసుకోవలసిన వారు.. ఆమె ఆస్తిని కాజేశారు. ఈ క్రమంలో తనకు న్యాయం చేయాలని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. గ్రామానికి చెందిన కొల్లిపాక కోటిరత్తమ్మ... భర్త రోషయ్య 20 ఏళ్ల క్రితం మరణించగా అప్పటి నుంచి కుమారుల వద్ద ఉంటోంది. కొద్ది రోజుల క్రితం ఆమె పేరు మీద ఉన్న 4 ఎకరాల భూమిని కుమారులు రాయించుకున్నారు. దాచుకున్న డబ్బు ఇవ్వాలని తల్లిని అడగగా.. ఆమె నిరాకరించింది. డబ్బులు ఇస్తేనే ఇంట్లోకి రావాలని చెబుతూ.. ఇంటి నుంచి బయటకు పంపారు.
మరోదారి లేక ఆ త్లలి ఊరి చివర ఉన్న పశువుల పాకలో కాలం గడుపుతోంది. ఈ మధ్య కురిసిన వర్షాలు, చలితో ఆమె ఇబ్బంది పడుతోంది. ఈ సయమంలో అండగా ఉంటూ బాగోగులు చూడాల్సిన పిల్లలే రోడ్డుపై వదిలేయడం వల్ల ఆ వృద్ధురాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తనకు న్యాయం చేయాలని అటుగా వెళ్లేవారిని వేడుకుంటోంది.
ఇదీ చదవండి: