గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో రైతులతో పొగాకు బోర్డు ఛైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామని ఆయన అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాజధానిని ఇక్కడి నుంచి తరలించకుండా చూడాలని రైతులు రఘునాథ బాబుకి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన రాజధానిలో ఇంత గందరగోళ పరిస్థితులు నెలకొన్న ముఖ్యమంత్రి ఇంతవరకు ఎందుకు స్పందించలేదని రఘునాథబాబు ప్రశ్నించారు. ఈనెల 29న సీఆర్డీఏ జగన్ సమీక్షించనున్నందున రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. లేకపోతే భాజపా ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
ఇదీచూడండి."రాజధానిగా అమరావతిని కొనసాగించే పరిస్థితుల్లో వైకాపా లేదు"