గుంటూరు జిల్లా కోబాల్ట్పేటలో గత నెల 25న అదృశ్యమైన సుభాని అనే యువకుడు శవమై కనిపించాడు. సుభాని ఆచూకి తెలియడంలేదని అతని కుటుంబసభ్యులు పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెడ్డిపాలెం విగ్నేశ్వరనగర్ 3వ లైన్లోని ఓ పాడుబడిన ఇంట్లో గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆధారాలను సేకరించి మృతిచెందిన వ్యక్తి సుభానిగా నిర్ధారించారు. మృతదేహం పక్కన శీతలపానీయం, క్రిమి సంహార రసాయన డబ్బా ఉన్నట్లు వివరించారు. అతను ఆత్మహత్య చేసుకున్నాడా.. ఎవరైనా హత్యచేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
ఇదీ చదవండి:
దిల్లీలో అన్నదాతల ఉద్యమం.. వామపక్ష పార్టీలు, రైతు సంఘాల మద్దతు