గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెంలో మృతి చెందిన ఉపాధ్యాయుడు కంచర్ల కోటేశ్వరరావు (41) మృతదేహన్ని తెనాలిలోని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సబ్ కలెక్టర్ మయూరి అశోక్, తహసీల్దార్ కె. రవిబాబు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
తెనాలి ఐతనగర్‌కు చెందిన ఉపాధ్యాయుడు కంచర్ల కోటేశ్వరరావు పిట్టలవానిపాలెంకు ఎన్నికల విధులకు వెళ్లి గుండెపోటుతో కన్నుమూశారు. మృతునికి భార్య సువర్ణ, పదేళ్ల కుమార్తె ఉన్నారు. భార్య గర్భిణీ కాగా.. మరో రెండురోజుల్లో డెలివరీ అవుతుందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయన నిజాంపట్నం మండలం ముత్తుపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
బుధవారం సాయంత్రం బాపట్ల నియోజకవర్గం పిట్టలవానిపాలెం మండలంలోని అల్లూరు మంతెన సత్యనారాయణ రాజు జిల్లా పరిషత్తు ప్రభుత్వ పాఠశాలలో జరగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విధులకు వెళ్లిన ఆయన గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. సబ్ కలెక్టర్ మయూరి అశోక్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కోటేశ్వరరావు కుటుంబ సభ్యులకు అండగా ఉంటామనీ.. ప్రభుత్వం తరుపు నుంచి రావాల్సిన వాటికి తమ వంతు కృషి చేస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి. ఇష్టారాజ్యంగా స్టడీ కేంద్రాలు... అక్రమాలకు దగ్గరగా దూరవిద్య..!