ETV Bharat / state

నీరు తగ్గింది... ప్రయాణం నిలిచింది

కృష్ణా నదిలో నీరు తగ్గిపోవటంతో అమరావతి గుడి ప్రాంతం నుంచి కృష్ణా జిల్లాకు బోట్లపై రాకపోకలు నిలిచిపోయాయి. చుట్టూ తిరిగి వెళ్లలేక ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నది దాటేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు.

author img

By

Published : Jun 5, 2020, 12:07 AM IST

నీరు తగ్గింది... ప్రయాణం నిలిచింది
నీరు తగ్గింది... ప్రయాణం నిలిచింది

గుంటూరు జిల్లా పరిధిలోని కృష్ణా నదిలో నీరు తగ్గిపోవటంతో అమరావతి గుడి ప్రాంతం నుంచి కృష్ణా జిల్లాకు బోట్లపై రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా ప్రత్యామ్నాయ మార్గాల్లో నది దాటేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా అమరావతి నుంచి చందర్లపాడు, జగ్గయ్య పేట వెళ్లాలంటే 80 కిలోమీటర్ల దూరంపైగా ప్రయాణించాలి. కానీ నది దాటితే సులువుగా అవతలి ప్రాంతానికి చేరుకోవచ్చు. అందుకే ఎక్కువ మంది ఈ ప్రాంతాల్లో బోట్ల ద్వారానే నది దాటేందుకు మొగ్గు చూపుతారు. నదిలో నీరు లేని కాలంలో మాత్రం ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నారు. ట్రాక్టర్లపై కూర్చుని రెండు జిల్లాల మధ్య రాకపోకలు సాగిస్తున్నారు. ఇసుకతో పాటు కొన్నిచోట్ల నీటిలో నుంచి వెళ్లాల్సి ఉండటంతో మిగతా వాహనాలు నది దాటే పరిస్థితి లేదు. ఈ క్రమంలో ప్రజలు ట్రాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. ఒక్కొక్కరి వద్ద రూ.20 తీసుకుని నది దాటిస్తున్నారు. అయితే కరోనా కారణంగా భౌతిక దూరం పాటించకపోవటం ఆందోళన కలిగిస్తోంది. కొందరు కనీసం మాస్కులు లేకుండా ప్రయాణం సాగిస్తున్నారు.

ఇదీ చూడండి: ఇళ్ల స్థలాల పేరుతో కోట్లు స్వాహా : చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.