పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు, మహిళలు 493వ రోజు ఆందోళన కొనసాగించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెం, అనంతవరం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, నెక్కల్లులో రైతులు నిరసన దీక్షలు చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్నా.. తమ ఆకాంక్ష నెరవేరేదాకా పోరాటం కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. మరోవైపు దీక్షా శిబిరాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని నోటీసులో పేర్కొన్నారు..
ఇదీ చదవండీ.. 'రాజకీయ కోణంలోనే ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టు చేశారు'