గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మూడు రాజధానులకు మద్దతుగా ఉద్యమంలో పాల్గొనేందుకు ఆటోలో వెళ్తున్న వ్యక్తులను కొంతమంది అడ్డుకున్నారు. తామంతా భూములు ఇచ్చి రోడ్డున పడుతుంటే ఈ మండలంలో ఉన్న వారే 3 రాజధానులకు మద్దతు తెలపటం ఏంటని ప్రశ్నించారు.
దీంతో మూడు రాజధానులకు మద్దతు తెలుపుతున్న వ్యక్తులు రోడ్డుపై బైఠాయించారు. తమను అడ్డగించిన వ్యక్తులు వచ్చి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వీరి ఆందోళనతో సచివాలయానికి వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గుంటూరు అర్బన్ జిల్లా ఏఎస్పీ ఈశ్వరరావు, మంగళగిరి డీఎస్పీ దుర్గాప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని నచ్చచెప్పటంతో పరిస్థితి సద్దుమణిగింది.
ఇవీ చదవండి..