ETV Bharat / state

'బిడ్డల కోసం బతకాలి.. నా ప్రాణాలు నిలపండి' - కరోనాతో తెనాలి వైద్యుడు మృతి

'అనారోగ్యంతో వచ్చే వారికి వైద్య చికిత్స అందించే నేను కరోనా బారినపడ్డా. నా బిడ్డల కోసం బతకాలి. నాకు మెరుగైన చికిత్స చేసి బతికించండి’ అని ఆ వైద్యుడు చేసిన ఆక్రందన అందరినీ కదిలించింది. అయితే ఎంతగా పోరాడినా... ఆరాటపడినా ఆయన ప్రాణాల్ని వైద్యులు కాపాడలేకపోయారు. కరోనా మహమ్మారి ఆయనను కాటేసింది.

tenali doctor died with corona
కరోనాతో వైద్యుడు మృతి
author img

By

Published : Jul 9, 2020, 8:47 AM IST

గుంటూరు జిల్లా తెనాలి ఆసుపత్రిలో పని చేస్తొన్న ఓ వైద్యుడి విషాదాంతమిది. తెనాలి డివిజన్‌ జిల్లా ఉప వైద్యారోగ్యశాఖాధికారి జె. నరసింహ నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలి ఆసుపత్రిలో పని చేస్తున్న పొరుగు సేవల ఉద్యోగి ఒకరికి ఇటీవల కరోనా సోకింది. శనివారం ఇక్కడి వైద్యులు, సిబ్బంది స్వాబ్‌ పరీక్ష చేయించుకున్నారు.

ఆదివారం వెల్లడైన ఫలితాల్లో ఓ వైద్యుడు, నర్సు, పారిశుద్ధ్య ఉద్యోగికి పాజిటివ్‌ వచ్చింది. అప్పటికే అస్వస్థతకు గురైన వైద్యుడిని గుంటూరు సర్వజనాసుపత్రికి తరలించారు. మంగళవారం రాత్రి ఆయనకు శ్వాస సంబంధిత సమస్య తలెత్తింది. మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని రాష్ట్ర కొవిడ్‌ కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున వైద్యుడు కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.

ఇవీ చదవండి...

భయం వద్దు.. ధైర్యంగా ఎదుర్కొందాం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.