తెలంగాణకు చెందిన వలస కూలీలను తీసుకెళ్లాలని ఆ ప్రభుత్వానికి చెప్పినా స్పందించడం లేదని హోంమంత్రి సుచరిత అన్నారు. వేరే రాష్ట్రాల్లో ఉన్న మన రాష్ట్ర కూలీలను ప్రత్యేక వాహనాలలో తీసుకువస్తున్నామని చెప్పారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక వసతి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని.. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.
వేరే రాష్ట్రాల వారు ఇబ్బంది పడకుండా మన రాష్ట్రం దాటే వరకు వసతి కేంద్రం దగ్గర భోజనం వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి వారి రాష్ట్ర కూలీలను తీసుకెళ్తామంటే తక్షణం ఏర్పాట్లు చేస్తామని హోంమంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: మోదీ సర్కార్ వీసా రూల్స్‌పై ప్రవాసీల అసంతృప్తి