ETV Bharat / state

TDP Sympathizers Votes Deletion: దృష్టి మళ్లించి డబ్బులాక్కెళ్లే ముఠాలు! సందట్లో సడేమియాలు.. టీడీపీ ఓట్లను తొలగించే పనిలో వైసీపీ నేతలు! - టీడీపీ ఓట్లు తొలగింపు

TDP Sympathizers Votes Deletion: ‘‘అటెన్షన్‌ డైవర్షన్‌ గ్యాంగ్స్‌’’ గురించి తెలుసు కదా..! బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసుకొచ్చే వారిని దృష్టి మళ్లించి మన చేతిలో ఉన్న నగదు సంచిని లాక్కొని పారిపోయో ముఠాల గురించి విన్నారు కదా..! అచ్చంగా అలాగే చంద్రబాబును అక్రమంగా అరెస్టులపై నిరసన వ్యక్తం చేయడంలో టీడీపీ కార్యకర్తలుంటే.. వైసీపీ మాత్రం, ఓట్ల రాజకీయానికి తెర లేపింది. ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల, మద్దతుదారుల ఓట్లు తొలగించటం వంటి పనులలో మునిగి తేలుతోంది.

TDP Sympathizers Votes Deletion
TDP Sympathizers Votes Deletion
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 18, 2023, 11:50 AM IST

TDP Sympathizers Votes Deletion: రాష్ట్రంలో జనాభా పెరుగుదలకు తగ్గట్లుగా ఓటర్లు పెరగలేదని, నకిలీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని వీటిపై సమగ్ర విచారణ జరపాలంటూ వైసీపీ తరఫున ఆ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని రెండు రోజుల కిందట ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నకిలీ ఓట్ల నెపంతో గుట్టు చప్పుడు కాకుండా టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించటం, జనాభా పెరుగుదలకు తగ్గట్లుగా ఓటర్ల పెరగుదల లేదనే సాకుతో తమకు అనుకూలంగా పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్పించాలనే పన్నాగం, కుట్ర.. దీని వెనక ఉందనే వాదనలు వ్యక్తమవుతున్నాయి.

జగన్‌ ప్రభుత్వ విధ్వంసకర విధానాల వల్ల రాష్ట్రంలో విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. దీంతో యువతరం పొరుగు రాష్ట్రాలకు వలస బాట పడుతోంది. వృద్ధులు, నడి వయస్కులే ఇక్కడ ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 18 సంవత్సరాలు నిండిన నవతరం ఓటర్లు ఎక్కడి నుంచి వస్తారు? ఓటర్ల సంఖ్య ఎలా పెరుగుతుంది? ఇవన్నీ తెలిసి కూడా ఇలాంటి ఫిర్యాదులు చేయటం వెనక మర్మమేంటి అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Double Votes in Macharla: మాచర్లలో అధికార పార్టీ నేతల డబుల్ ధమాకా.. 5వేల మందికి రెండేసి ఓట్లు

రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ల జాబితా చూసినా అవకతవకలు, అక్రమాలు కోకొల్లలుగా వెలుగు చూశాయి. ప్రధానంగా టీడీపీకు పట్టున్న నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో ఓట్లు తొలగించారు. ఒకే ఇంట్లో భర్తకు ఓటు ఉండి.. భార్యకు లేకుండా చేశారు. దశాబ్దాలుగా ఒకే చిరునామాలో నివసిస్తున్న వారి పేర్లను సైతం ఆ ప్రాంత ఓటర్ల జాబితాల నుంచి తొలగించారు. బతికున్న వారి ఓట్లు గల్లంతు చేసి, చనిపోయిన వారిని మాత్రం కొనసాగించారు.

Votes Deletion in AP: గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేసిన వారి పేర్లు ప్రస్తుత ఓటర్ల జాబితాలో దొరక్కుండా చేశారు. ఒకే కుటుంబంలోని కొందరి ఓట్లు ఒక పోలింగ్‌ కేంద్రం పరిధిలో మరికొందరి పేర్లు మరో పోలింగ్‌ కేంద్రంలో పరిధిలో చేర్చారు. కొన్ని కుటుంబాలకు సంబంధించి అందరి ఓట్లు గల్లంతైన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఒకే డోర్‌ నంబర్‌లో వందల సంఖ్యలో ఓటర్లు ఉన్నట్లు నమోదు చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన టీడీపీ కొంత కాలంగా క్షేత్రస్థాయిలో ఈ అక్రమాలు, అవకతవకలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసి ఆ అక్రమాలను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది.

TDP Leaders Complained about Votes Deletion కాకినాడలో 52 వేల 941 ఓట్లు తొలగించేందుకు దరఖాస్తులు.. కలెక్టర్​కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు

ఈ ప్రక్రియ ఉద్ధృతంగా సాగుతున్న దశలో చంద్రబాబును అక్రమ కేసులో అరెస్టు చేశారు. టీడీపీ దృష్టంతా అటు మళ్లటంతో వారు అప్రమత్తంగా లేని సమయాన్ని చూసుకుని వైసీపీ నాయకులు ఇప్పుడు కొత్త ఎత్తుగడ అవలంబిస్తున్నారు. అనేక నియోజకవర్గాల్లో వాలంటీర్లతో సమావేశాలను ఏర్పాటు చేసి ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారి ఓట్లను తొలగించేందుకు ఫారం-7 దరఖాస్తులు, నకిలీ ఓట్లను చేర్పించడానికి ఫారం-6 దరఖాస్తులను పెద్ద ఎత్తున దాఖలు చేపిస్తున్నారు.

Fake Votes in Andhra Pradesh: టీడీపీ శ్రేణులన్నీ ఆందోళనల్లో తలమునకలై ఉండటంతో ఇదే అదునుగా కొన్ని నియోజకవర్గాల పరిధిలో కొత్తగా ఓటర్లుగా చేరటం కోసం, ఉన్న ఓట్లు తొలగించటానికి నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు ఎన్నికల అధికారులకు అందుతున్నాయి. ఈ దరఖాస్తుల వెనక వైసీపీ నాయకులే ఉంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాటిపై ఎవరూ అభ్యంతరం తెలిపే అవకాశం లేనందున తమకు అనుకూలంగా నకిలీ ఓట్లు చేర్పించేందుకు, ప్రతిపక్షాలకు చెందిన వారి ఓట్లు తీసివేసేందుకు ఇదే అనువైన సమయంగా వైసీపీ నాయకులు ఎంచుకున్నారు.

Irregularities in Voter List దుకాణానికి ఇంటి నంబర్.. 100కి పైగా ఓట్లు! నంబరే లేని ఇంట్లో ఏకంగా 280..

Irregularities in Voters List: వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో కొత్తగా ఓటర్లు నమోదు కోసం ఏప్రిల్‌ నుంచి ఈ నెల 15 వరకు ఏకంగా 32 వేల 417 దరఖాస్తులొచ్చాయి. ఒకే నియోజకవర్గంలో ఇంత భారీ మొత్తంలో రావటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిల్లో అత్యధిక శాతం ఈ మధ్య కాలంలో అందినవే అని సమాచారం.

Fake Voters List in Bheemili : '0.. 00.. 000..' ఇవన్నీ ఇంటి నెంబర్లే! భీమిలిలో వెలుగులోకి నకిలీ ఓటర్ జాబితాలు

TDP Sympathizers Votes Deletion: దృష్టి మళ్లించి డబ్బులాక్కెళ్లే ముఠాలు! సందట్లో సడేమియాలు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.