ETV Bharat / state

TDP RALLY FOR FARMERS: గుంటూరు జిల్లాలో రైతు కోసం తెదేపా​ ర్యాలీ - తెలుగుదేశం పార్టీ నిరసనలు

రైతు సమస్యలపై గుంటూరు జిల్లా తెలుగుదేశం నేతలు వివిధ రూపాల్లో వినూత్నంగా ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో వర్షాలు పడినా కనీసం పంటలకు నీరు ఇవ్వని దుస్థితి నెలకొందని దుయ్యబట్టారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైకాపా విఫలమైందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP RALLY FOR FARMERS
TDP RALLY FOR FARMERS
author img

By

Published : Sep 30, 2021, 5:39 PM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో పార్టీ శ్రేణులు కదంతొక్కారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు నేతృత్వంలో పెద్ద ఎత్తున ట్రాక్టర్లతో తరలివచ్చిన రైతులు చిలకలూరిపేట కార్యాలయం నుంచి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని వినతిపత్రం ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, తెదేపా రాష్ట్ర నాయకులు పిల్లి మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇన్​ఛార్జ్​ చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో తెదేపా నాయకుల ట్రాక్టర్లు, ఎద్దులతో వినూత్న ర్యాలీ నిర్వహించారు. రైతు ఆత్మహత్యలలో దేశంలోనే రాష్ట్రం మూడవ స్థానంలో ఉందని రేపల్లె తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైకాపా విఫలమైందని.. సకాలంలో వర్షాలు పడినా కనీసం పంటలకు నీరు ఇవ్వని దుస్థితి నెలకొందని దుయ్యబట్టారు. రైతు వ్యతిరేక చట్టాలపై తెదేపా పోరాటం చేస్తూనే ఉంటుందని..వైకాపా నేతలకు ప్రజలు తప్పక బుద్ధి చెబుతారని అన్నారు.

తెలుగుదేశం చేపట్టిన రైతుకోసం కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. మేడికొండూరులో ఎడ్లబండ్ల ప్రదర్శనను పోలీసుుల అడ్డుకోవడంతో తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజధాని అమరావతిని నాశనం చేశారంటూ మహిళా రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రత్తిపాడులో డప్పుల ర్యాలీను పోలీసులు అడ్డుకున్నారు. కేవలం పాదయాత్ర మాత్రమే నిర్వహించాలని..మైకులు, డప్పులకు అనుమతించేది లేదని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా.. తుళ్లూరు గ్రామానికి చెందిన రాజధాని మహిళా రైతు మల్లేశ్వరి మాట్లాడుతూ వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు కంట రక్తం కారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లాలోని తాడేపల్లి మండలం పాతూరులో తెదేపా నేతలు నిరసన చేపట్టారు. మంగళగిరి నియోజకవర్గ తెదేపా నేతలు, రైతులు నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. పాతూరులోని పొలాల్లో రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. కేంద్ర నిధులతో సంబంధం లేకుండా ఏటా రైతుల ఖాతాల్లో రూ. 13,000 వేస్తానన్న జగన్ ఇప్పటివరకు ఎంత ఇచ్చారంటూ ప్రశ్నించారు. కేంద్రం ఒత్తిడికి తలొగ్గి రైతుల నెత్తిన విద్యుత్ మీటర్ల భారం మోపుతున్నారని నేతలు ఆరోపించారు. రైతులను వైకాపా ప్రభుత్వం మోసం చేస్తోందని పొన్నూరు మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. రైతుల్ని ఆదుకోవటంలో వైకాపా సర్కారు ఘోరంగా విఫలమైందని తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా కర్లపాలెంలో జరిగిన రైతుకోసం తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ- క్రాప్ విధానం వరికి తప్ప మిగతా పంటల్లో సాధ్యం కాదన్నారు. నివర్ తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకూ పరిహారం ఇవ్వలేదని విమర్శించారు.

ఇదీ చదవండి:

high security number plate:'ఇక నుంచి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ తప్పనిసరి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.