Bonda Umamaheswara Rao: సిట్ వ్యవహారంపై కొంత మంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లు నాలుగేళ్ల నుంచి ఏం పీకారు, ఒక్క కేసులో కూడా చార్జిషీట్ వేయలేదని అన్నారు. రేపో ఎల్లుండో అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమని అన్నారు. 50 మంది ఎమ్మెల్యేలు సీట్లు వద్దంటున్నారు, ఎమ్మెల్యేలు పారిపోతున్నారు, సమన్వయకర్తలు కాడి పడేస్తున్నారంటూ విమర్శించారు. రాజశ్యామల యాగం చేసే అర్హత ముఖ్యమంత్రి జగన్‌కి లేదని బొండా ఉమా స్పష్టం చేశారు. హిందూ మతాన్ని నమ్మేవారే ఆ యాగం చేయాలని అన్నారు.
దేవాలయాల డబ్బులు 10 కోట్లు వెచ్చించి ఈ యాగం ఎలా చేస్తారని ప్రశ్నించారు. జగన్ రెండోసారి ముఖ్యమంత్రి కావటానికి ప్రజల డబ్బుతో రాజశ్యామల యాగం చేయటం విడ్డూరమని మండిపడ్డారు. వైసీపీ నేతలు యాగం చేయాలంటే వారి సొంత డబ్బుతో చేయాలని అన్నారు. గతంలో రాజశ్యామల యాగం నిర్వహించిన స్వరూపానందని పక్కనపెట్టి లాబీయిస్ట్ విజయకుమార్ అనే మాయల పకీర్ని రంగంలోకి దించారన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్న జగన్ వారి ఆగ్రహానికి గురికాక తప్పదని బొండా ఉమా హెచ్చరించారు. కాపులకు చంద్రబాబు ఏమి చేయలేదు అని జగన్ దగ్గర ఉండే చెంచా కాపు నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.
టీడీపీ హయాంలోనే కాపులకు న్యాయం జరిగింది.. జగన్ ఏమి చేశాడని నిలదీశారు. జగన్ తాను సీఎం అయ్యాక 10 వెల కోట్లు కాపులకు ఇస్తా అని ఒక్క రూపాయి ఇవ్వలేదని.. జగన్ కాపు ద్రోహి అంటూ ధ్వజమెత్తారు. పదవుల కోసం వైసీపీలో ఉన్న కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు కులాన్ని జగన్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టొద్దని హితవుపలికారు. చంద్రబాబు హయాంలో కాపులకు స్వర్ణయుగంగా ఉందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ కాపు ప్రజా ప్రతినిధులు దెబ్బలు తినడం ఖాయమన్నారు. వైసీపీలో ఉన్న కాపు ప్రజా ప్రతినిధులు అంతా జగన్ పెంపుడు కుక్కలంటూ బొండా ఉమా మండిపడ్డారు.
ఏ మతాన్ని ఆచరిస్తావు.. అసలు నువ్వు దంపతులతో కలిసి గుడికి వెళ్లిన ధాఖలాలు లేవు. గతంలో ఇలాంటి కార్యక్రమాలే స్వరూపానంద స్వామి చేత చేయించావు. ఈ రోజు ఆయన్ని కూడా పక్కనపెట్టి లాబీయిస్ట్ మాయల పకీర్ లాంటి విజయకుమార్‌ను రంగంలోకి దించారు. ఈయన ఆధ్వర్యంలో దేవాలయాల డబ్బులతో జగన్ రెండోసారి ముఖ్యమంత్రి అవ్వడం కోసం ఈ యాగాన్ని ఇక్కడ చేస్తున్నారు. దీనికి ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు వెళ్లి పర్యవేక్షణ చేస్తున్నారు. ఇలాంటివి చెయ్యాలంటే నీ సొంత డబ్బులతో చేసుకో.. దేవాలయాల డబ్బు ఖర్చు పెట్టే హక్కు నీకు ఎక్కడిది.- బొండా ఉమామహేశ్వరరావు, టీడీపీ నేత
ఇవీ చదవండి: